అయోధ్య కేసులో మరో ట్విస్ట్

Supreme Court
x
Supreme Court
Highlights

అయోధ్య భూవివాద కేసు ఈనెల 29కి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఇవాళ ఈ అంశంపై విచార‌ణ ప్రారంభించేందుకు నిరాక‌రించింది. జస్టిస్ లలిత్ ధర్మాసనంలో ఉండటంపై న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయోధ్య భూవివాద కేసు ఈనెల 29కి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఇవాళ ఈ అంశంపై విచార‌ణ ప్రారంభించేందుకు నిరాక‌రించింది. జస్టిస్ లలిత్ ధర్మాసనంలో ఉండటంపై న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఇదే కేసులో జస్టిస్ లలిత్, కల్యాణ్ సింగ్ తరుపున వాదించారని రాజీవ్ తన పిటిషన్ లో కోరారు. దీంతో ఈ బెంచ్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు జస్టిస్ లలిత్ తెలిపారు. విచారణకు ముందే ఆయన ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయోధ్య కేసులో జనవరి 29 నుంచి కొత్త ధర్మాసనం వాదనలు వింటుందని న్యాయస్థానం తెలిపింది.

అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. అయితే ల‌లిత్ వైదొల‌గ‌డంతో ఆయ‌న స్థానంలో కొత్త జ‌స్టిస్‌ను ఎంపిక చేయ‌నున్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల ధర్మానం ఈనెల 29 నుంచి విచారణను ప్రారంబించనుంది.

అయోధ్యలోని రెండు ఎకరాల 77 సెంట్లు భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలని అలహాబాద్‌ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే, అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. అయితే, అయోధ్య భూవివాదంపై అత్యవసర విచారణ చేపట్టాలని హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. అప్పీళ్లపై విచారణను తగిన ధర్మాసనానికి నివేదిస్తామని జనవరి నాలుగున జరిగిన విచారణలో స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టులో అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories