Top
logo

నేడు వోల్ఫ్‌-బ్లడ్‌- సూపర్‌మూన్‌

నేడు వోల్ఫ్‌-బ్లడ్‌- సూపర్‌మూన్‌
X
Highlights

ఆకాశంలో మరోమారు అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం వోల్ఫ్‌-బ్లడ్‌-సూపర్‌మూన్‌గా ఆకట్టుకోనుంది. ఆయా దేశాలను బట్టి ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు గ్రహణం కొనసాగనుంది.

ఆకాశంలో మరోమారు అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం వోల్ఫ్‌-బ్లడ్‌-సూపర్‌మూన్‌గా ఆకట్టుకోనుంది. ఆయా దేశాలను బట్టి ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు గ్రహణం కొనసాగనుంది. భూమికి బాగా దగ్గరగా వస్తున్నందున చంద్రుడు ఎప్పటి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే దీన్ని సూపర్‌మూన్‌ అంటారు. సుమారు గంటకుపైగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో సూర్యకిరణాలు భూవాతావరణం మీదుగా చంద్రుడిపైకి పరావర్తనం చెందడం వల్ల చంద్రుడు ఎర్రగా కూడా కనిపిస్తాడు. అందుకే దీన్ని బ్లడ్‌ మూన్‌ అని కూడా పిలుస్తారు.

అలాగే జనవరిలో పౌర్ణమి చంద్రుడిని వోల్ఫ్‌ మూన్‌ అని పిలుస్తారు. అందువల్ల ఈ చంద్రగ్రహణాన్ని మొత్తంగా వోల్ఫ్‌, బ్లడ్‌, సూపర్‌మూన్‌ అని పిలుస్తున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికా, గ్రీన్‌ల్యాండ్‌, ఐస్‌ల్యాండ్‌, ఐర్లాండ్‌, గ్రేట్‌ బ్రిటన్‌, నార్వే, స్వీడన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ తీరాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుందని అమెరికాలోని రైస్‌ యూనివర్సిటీ ఖగోళ భౌతికశాస్త్రవేత్త పాట్రిక్‌ హార్టిగన్‌ తెలిపారు. యూరప్‌లోని మిగిలిన దేశాలు, ఆఫ్రికా దేశాల్లో మాత్రం పాక్షిక గ్రహణం కనిపిస్తుందని చెప్పారు. భారత్‌లో ఇది కనిపించే అవకాశం లేదు.

Next Story