బీ అలర్ట్‌ ...వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బీ అలర్ట్‌ ...వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
x
Highlights

వచ్చే వారం రోజులూ ఎండలు దంచి కొడతాయని, వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో టెంపరేచర్స్‌ 40 డిగ్రీలను దాటతాయని...

వచ్చే వారం రోజులూ ఎండలు దంచి కొడతాయని, వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో టెంపరేచర్స్‌ 40 డిగ్రీలను దాటతాయని హెచ్చరించిన ఐఎండీ మధ్యాహ్నం 12నుంచి 3గంటల వరకు బయటికి రావొద్దని సూచిస్తోంది. మరోవైపు డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.

రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, ఎండవేడికి ప్రతి ఒక్కరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హై-టెంపరేచర్స్‌, వడగాలుల దెబ్బకు డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. అయితే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే డీహైడ్రేషన్‌తోపాటు సమ్మర్‌ సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చంటున్నారు వైద్యులు.

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి

2. వీలైనన్నిసార్లు చన్నీళ్ల స్నానం చేయాలి

3. మాంసాహారం తగ్గించాలి

4. కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి

5. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి

6. టీ, కాఫీలు తగ్గించాలి

7. వదులుగా ఉండే తేలికపాటి వస్త్రాలు ధరించాలి ( వైట్‌ అండ్ లైట్‌ కలర్స్ )

8. లివింగ్ రూమ్‌ను చల్లగా ఉంచుకోవాలి

9. హాఫ్ బకెట్‌ నీటిని గదిలో ఉంచుకోవాలి

10. చిన్న పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

11. అత్యవసరమైతేనే బయటికి రావాలి

12. కళ్లకు సన్‌గ్లాసెస్‌‌, ముఖానికి క్లాత్స్‌, తలపై టోపీ ధరించాలి

13. నూనె పదార్థాలు, వేపుళ్లు, కారం, మసాలాలు తగ్గించాలి

14. పీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి

15. చర్మంపై తేమ ఉండేలా సన్ క్రీమ్స్ రాసుకోవాలి

16. కాచి చల్లార్చిన నీటిని తాగాలి

17. కిటికీలు తెరిచి గాలి తగిలేలా చూసుకోవాలి

18. మధ్యాహ్నం 12నుంచి 3గంటల వరకు బయటికి వెళ్లకపోవడం మంచిది

19. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్లూయిడ్స్, గ్లూకోజ్ తీసుకోవాలి

20. నోరు-కళ్లు-చర్మం పొడిబారకుండా చూసుకోవాలి

డీహైడ్రేషనే కదా అని లైట్‌ తీస్కుంటే గుండెపోటు సైతం వచ్చే ప్రమాదముందంటున్నారు వైద్యులు. అందుకే సమ్మర్‌లో అధికంగా నీటిని తీసుకోవడంపాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, కీరదోస, క్యారట్, బీట్‌రూట్‌, పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఇంటిని చల్లగా ఉంచుకోవడం, తేలికపాటి వస్త్రాలను ధరించడం, తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు.

తప్పనిసరైతే తప్ప మధ్యాహ్నం 12నుంచి 3గంటల వరకు బయటికి రావొద్దంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే పిల్లలు రోటా వైరస్‌ బారినపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. రోటా బారిన పడితే వాంతులు, అధిక జ్వరం లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక వడదెబ్బకు గురైతే విపరీతమైన జ్వరం, తల తిరగడం, నీరసం, నాడి వేగంగా కొట్టుకోవడం, కండరాల నొప్పి, నోరు-కళ్లు-చర్మం పొడిబారడం, దురద, మంట, సన్ బర్న్స్‌, కళ్లు ఎర్రబడటం, డాండ్రఫ్‌, విరేచనాలు, మొటిమలు, చెమటకాయలు, ముదురు పసుపు రంగులో మూత్రం లాంటి లక్షణాలు కనిపిస్తాయని, అంతేకాదు టైఫాయిడ్ కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories