సమ్మర్ ఎఫెక్ట్ : కిలో చికెన్ 200

సమ్మర్ ఎఫెక్ట్ : కిలో చికెన్ 200
x
Highlights

ప్రస్తుతం కొడుతున్న ఎండలకు మనుషులే పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక మనుషుల కంటే సున్నితమైన కోళ్ళ సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు . పెరుగుతున్న...

ప్రస్తుతం కొడుతున్న ఎండలకు మనుషులే పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక మనుషుల కంటే సున్నితమైన కోళ్ళ సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు . పెరుగుతున్న ఉష్ణోగ్రతకి కోళ్ళ ఫారమ్ లో కొన్ని వందల కోళ్ళు చనిపోతున్నాయి. సమ్మర్ లో సాధారంగా అయితే చికెన్ ధర వంద రూపాయల కంటే ఎక్కువగా ఉండదు. భానుడు పుణ్యమా అని తగ్గాల్సిన చికెన్ ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది .ప్రస్తుతం చికెన్ ధర కిలో 200 రూపాయలు ఉంది .

పోనీ ఇంతా ధర వచ్చినా కోళ్ళ పరిశ్రమకి అంతో ఇంతో లాభంగా ఉందా అంటే అది లేదనే చెప్పాల్సి వస్తుంది . ప్రస్తుతం కోళ్ళు చనిపోకుండా ఉండేదుకు కోళ్ళ ఫారమ్ పరిశ్రమలోని యాజమాన్యాలు ఎన్ని పద్దతులు తీసుకున్న రోజుకు 40 నుండి 50 కోళ్ళు చనిపోతున్నాయి .చికెన్ ధర మాత్రమే కాకుండా కోడిగుడ్డు ధర పెరిగింది . ఒక్కో గుడ్డు ధర ఇప్పటివరకు ఐదు రూపాయల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆరు రూపాయలకు చేరింది . ఇది మాంసం ప్రియులను మరియు కోళ్ళ ఫారమ్ పైనే ఆధారపడ్డ రైతులను కలవర పెట్టె అంశం ..

Show Full Article
Print Article
Next Story
More Stories