ఒక్కో విద్యార్థిది ఒక్కో వ్యధ..

ఒక్కో విద్యార్థిది ఒక్కో వ్యధ..
x
Highlights

వాళ్లు కష్టపడి చదివారు. రాత్రనకా, పగలనకా పుస్తకాలతో కుస్తీ పట్టారు. ర్యాంకులు, ఫస్ట్ క్లాస్ లలో పాస్ అవుతామని కలలుగన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్...

వాళ్లు కష్టపడి చదివారు. రాత్రనకా, పగలనకా పుస్తకాలతో కుస్తీ పట్టారు. ర్యాంకులు, ఫస్ట్ క్లాస్ లలో పాస్ అవుతామని కలలుగన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఫీజులు భారం అయినా భరించారు. కానీ ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల వల్ల వారి ఆశలు ఆడియాశలయ్యాయి. ఒక్కో విద్యార్థిది ఒక్కో వ్యధ, ఒక్కో గాథ. ఇంటర్ మార్కుల అవకతవకలపై బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నాయి. బోర్డు ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థిది ఒక్కో వ్యధ. ఈ విద్యార్థిని ఫస్టియర్ లో అన్ని సబ్జెక్ట్ లు పాస్ అయింది. సెకండ్ ఇయర్ లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. కెమిస్ట్రీలో కేవలం 6 మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఇంటర్ బోర్డు ఎదుట ఈ ముగ్గురు విద్యార్థులు తమ మార్కుల లిస్ట్ తో బైఠాయించారు. బోర్డు లోపలికి వెళ్లేందుకు అనుమతించమని డిమాండ్ చేశారు. ఈ విద్యార్థికి పదో తరగతిలో 90. 4 శాతం మార్కులు రాగా ఇంటర్ ఫస్టియర్ లో అన్ని సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయినట్లు మార్కుల లిస్ట్ వచ్చింది. కేవలం 35 మార్కులు వచ్చాయి. ఇంటర్ అధికారులు బయటకు వచ్చి మాట్లాడాలని బాధిత విద్యార్తి డిమాండ్ చేస్తున్నాడు. మార్కుల వెరిఫికేషన్ కు వెళితే సర్వర్ స్లో అని వస్తుంది అని ఈ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఫస్టియర్ ఇంటర్ లో 99 మార్కులు వచ్చిన విద్యార్థులకు జీరో మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విద్యార్థికి విచిత్రంగా మార్కులు వచ్చాయి. మార్కుల వెరిఫికేషన్ లో ఒకసారి పాస్ వస్తుంది. మరోసారి కేవలం 16 మార్కులు వస్తున్నాయి. తాను పరీక్ష రాసిన పేపర్లు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.

బాగా చదివే తమ కూతుర్ని ఫెయిల్ చేశారని, ఆ బాధతో మూడు రోజుల నుంచి భోజనం చేయడంలేదని ఈ తల్లి వాపోతుంది. ఏదైనా ఆఘాయిత్యానికి పాల్పుడుతుందో అన్న భయంతో కాపలా కాస్తున్నామని చెబుతోంది. తమ బిడ్డకు ఒక్కో సబ్జెక్ట్ లో 60కి పైగా మార్కులు వస్తే, మ్యాథ్స్ లో 11, 12 మార్కులు వేశారని ఈ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమ కూతురికి న్యాయం కావాలని డిమాండ్ చేస్తుంది. తమ కూమరుడికి అన్ని సబ్జెక్ట్ లలో రావాలసిన మార్కులు కంటే తక్కువ వచ్చాయని ఈ తండ్రి అంటున్నారు. ఈ మార్కులతో ఎంసెట్ లేదా ఐఐటీ లాంటి పరీక్షలు రాయలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యకు ఇంటర్ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ మూల్యంకనంలో జరిగిన తప్పిదాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories