వివాదంలో ఏపీపీఎస్సీ ...

వివాదంలో ఏపీపీఎస్సీ ...
x
Highlights

ఏపీపీఎస్సీ తీరు వివాద స్పదం అవుతోంది పరీక్షల నిర్వాహణలో జరుగుతున్న తప్పులపై అభ్యర్ధుల నుండే కాకుండా రాజాకీయ పక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి....

ఏపీపీఎస్సీ తీరు వివాద స్పదం అవుతోంది పరీక్షల నిర్వాహణలో జరుగుతున్న తప్పులపై అభ్యర్ధుల నుండే కాకుండా రాజాకీయ పక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. గ్రూప్-3, గ్రూప్-2 పరీక్ష ఏదైనా నిర్వాహణలో మాత్రం వివాదాలు కామన్ అవుతున్నాయి. ఏపీపీఎస్సీ చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి.

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-3, గ్రూప్ -2 పరీక్షలు అభ్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 పంచాయతీ సెక్రటరీ పరీక్షకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ రెండు బాషల్లోనూ ప్రశ్నాపత్రం ఇచ్చినా అనువాదం విషయంలో అనేక తప్పులు దొర్లడంతో అభ్యర్ధులు ఇబ్బందులు పడ్డారు. తెలుగులో ఇచ్చిన ప్రశ్నకు ఇంగ్లీష్ ప్రశ్నకు పొంతన లేని అనువాదంతో అయోమయానికి గురయ్యారు. అధికారులు చేసిన తప్పిదాలకు విలువైన సమయం వృధా అయ్యిందని అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గ్రూప్ 2 ప‌రిక్ష విష‌యంలోనూ మ‌రో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. రాష్ర్ట ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు ఉండటం దుమారం రేగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వానికి చెందిన ప్రశ్నలు ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కమిషన్ ఎన్నికల కోడ్ ఉల్లంగించిందని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ యువజన విభాగం నేతలు.

ఏపీపీఎస్సీ కమీషన్ పై వస్తున్న విమర్శలను ఖండించారు చైర్మన్ ఉదయ్ భాస్కర్. ఉద్యోగాల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ అని ఏపిపీఎస్సికి ఎన్నికల కోడ్ వర్తించదన్నారు. పరీక్షల్లో ఏఏ ప్రశ్నలు వస్తాయో పరీక్ష ముగిసేవరకూ చైర్మన్ మెంబర్స్ కు తెలిసే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండటం కోసమే ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయన్నారు. నిరుద్యోగ యువత కోసం ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలను రాజకీయ కోణంలో చూడటం సరికాదంటున్నారు పలువురు. కొన్ని తప్పిదాలను సరిేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories