టెన్త్ ఫలితాల్లో విద్యార్థికి షాక్.. అన్ని సబ్జెక్టుల్లోనూ..

టెన్త్ ఫలితాల్లో విద్యార్థికి  షాక్.. అన్ని సబ్జెక్టుల్లోనూ..
x
Highlights

సర్వ సాధరణంగా విద్యార్థులు పరీక్షల్లో బార్డర్‌ మార్కులతో గట్టుఎక్కుతుంటారు. అంటే కేవలం 35 మార్కులతోని నెట్టుకొస్తారు. హమ్మయ్య బార్డర్‌ మార్కులతో...

సర్వ సాధరణంగా విద్యార్థులు పరీక్షల్లో బార్డర్‌ మార్కులతో గట్టుఎక్కుతుంటారు. అంటే కేవలం 35 మార్కులతోని నెట్టుకొస్తారు. హమ్మయ్య బార్డర్‌ మార్కులతో బతికి బయటపడ్డాం రా బాబు అంటూ, అర్రే నాకు ఇంకోక్క రెండు మార్కులు వోస్తే బార్డర్ మార్కులతో బయటపడేవాడ్నిర్రా అంటూ.. విద్యార్థుల మధ్య ఈ సంభాషణ తరచూ వింటుంటాం. అయితే ఓ విద్యార్థికి మాత్రం విచిత్రం అన్ని సబెక్టుల్లోనూ 35 మార్కులు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్ అందరిలాగే పదవతరగతి పరిక్ష రాసాడు. గత శనివారం మహారాష్ట్ర టెన్త్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేసింది. కానీ రిజల్ట్ చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు అక్షిత్. ఎందుకంటే అక్షిత్‌కి అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా 35 మార్కులు వచ్చాయి. అంటే ఫాస్ అయ్యాడు అన్నమాట. దీంతో అక్షిత్ జాదవ్ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయాడు.

ఈ సందర్భంగా అక్షిత్ జాదవ్ తండ్రి గణేశ్ మాట్లాడూతూ మా కుమారుడి ఫలితాలు చూసి చాలా ఆశ్చర్యపోయాం. జాదవ్ 55శాతం మార్కులతో పాస్‌ అవుతాడని అనుకున్నాం. కానీ విచిత్రంగా అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే వచ్చాయి. అయితే అతడు అన్ని పేపర్స్‌లో పాస్‌ అవడం ఆనందంగా ఉందని చెప్పారు. కాగా అక్షిత్‌ 9వ తరగతిలో ఫెయిల్‌ అవడంతో ఆ తర్వాత నుండి బడికి వెళ్లడంలేదు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ప్రైవేటుగా రాసి 35 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. తన కుమారుడికి ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టమని, క్రీడలనే కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో ఈ మార్కులపై జోకులు ఓ రేంజ్‌లో పేలాయి. ఇప్పుడు జాదవ్ మార్కుల లిస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories