తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు..

తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు..
x
Highlights

తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ ఆహ్వానం మేరకు పార్టీ ముఖ్య నేతలతోపాటు ఎమ్మెల్యేలు హస్తినకు...

తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ ఆహ్వానం మేరకు పార్టీ ముఖ్య నేతలతోపాటు ఎమ్మెల్యేలు హస్తినకు బయల్దేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చించనున్నారు. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5గంటలకు ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాహుల్‌తోనూ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీతోనూ భేటీ అవుతారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీల నియామకాలపై ప్రతిపాదనలను రాహుల్‌కి ఇవ్వనున్నారు.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత అధిష్టానం తెలంగాణ నేతలపై గుర్రుగా ఉంది. దీంతో చాలా రోజులుగా రాహుల్‌ను కలిసేందుకు పీసీసీ అధ్యక్షుడితో సహా పలువురు సీనియర్ నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో పార్టీ నేతలంతా రాహుల్ పిలుపు కోసం చాలా కాలం నుంచి వేచిచూస్తున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతోపాటు కొత్తగా ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో అందరూ ఢిల్లీకి బయల్దేరారు.

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల నేతలతో రాహుల్ సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలించకపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చడానికి అధిష్టానం ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం కారణంగా కార్యకర్తల్లో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

పార్లమెంటు ఎన్నికల్లో పూర్వ వైభవం తేవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు వివరించనున్నారు. ఏపీలో విభజన హామీల అమలులో కేంద్రం వైఫల్యం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ఫోకస్ చేసి రాష్ట్రంలో పూర్వవైభవం కోసం నేతలు ప్రయత్నించనున్నారు. ఇక తెలంగాణలో టీఆర్‌ఎస్‌‌ను కాకుండా బీజేపీని టార్గెట్‌గా ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ సీట్లు సాధించొచ్చన్న భావనలో అధిష్టానం దిశానిర్ధేశం చేయనుందని తెలుస్తోంది. వీటితోపాటు పార్టీని రెండు రాష్ట్రాల్లోనూ బలోపేతం చేయడంపై పలు నిర్ణయాలు తీసుకోనుంది అధిష్టానం. డీసీపీల నియామకం, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరితో రాహుల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories