ముఖంపై ముసుగులు వేయొద్దు!.: శ్రీలంక సంచలన నిర్ణయం..

ముఖంపై ముసుగులు వేయొద్దు!.: శ్రీలంక సంచలన నిర్ణయం..
x
Highlights

శ్రీలంకలో మారణహోమం జరిగి వరుస బాంబు పేలుళ్లతో కొలంబో చిగురుటాకులా వణికిపోయింది. పవిత్ర ఈస్టర్‌ రోజు వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్ధరిల్లింది....

శ్రీలంకలో మారణహోమం జరిగి వరుస బాంబు పేలుళ్లతో కొలంబో చిగురుటాకులా వణికిపోయింది. పవిత్ర ఈస్టర్‌ రోజు వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్ధరిల్లింది. 8చోట్ల జరిగిన దాడుల్లో సుమారు 321మంది చనిపోయారు. 500 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే కాగా మానవబాంబుల దాడిలో సర్వం కోల్పోయిన శ్రీలంక ప్రభుత్వం దేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీలంక సర్కార్ కఠిన చట్టాలను చేసేందుకు రేడీ అయింది. ఇందులో భాగంగానే తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంకలో నేటి నుంచి అంటే ఎప్రిల్ 29నుండి ఏ ఒక్కరు కూడా బుర్ఖా ధరించరాదని శ్రీలంక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే లంకలో చట్టవిరుద్ధ చర్యలను అడ్డుకునేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. అయితే సైనిక బలగాలకు తనిఖీల్లో ఇబ్బందులు రాకుండా నిందితులను వెంటనే గుర్తించేందుకే బుర్ఖాపై నిషేధం విధిస్తునట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని ముస్లిం నేతలు కూడా అంగీకరించారని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories