ప్రాణాంతకంగా మారిన పబ్‌ జీ...

ప్రాణాంతకంగా మారిన పబ్‌ జీ...
x
Highlights

డ్రగ్స్ కంటే డేంజర్ గా మారింది ఆ గేమ్. ఆ మాయదారి ఆటలో పడ్డ చిన్నారులు తల్లిదండ్రులతో పాటు బయట ప్రపంచానికి దూరం అవుతున్నారు. మద్యం, డ్రగ్స్, సిగరెట్స్‌...

డ్రగ్స్ కంటే డేంజర్ గా మారింది ఆ గేమ్. ఆ మాయదారి ఆటలో పడ్డ చిన్నారులు తల్లిదండ్రులతో పాటు బయట ప్రపంచానికి దూరం అవుతున్నారు. మద్యం, డ్రగ్స్, సిగరెట్స్‌ కన్నా ఇప్పుడు ఆ గేమ్ పేరు చెబితేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. టీనేజర్లను వ్యనసపరులుగా మారుస్తున్నా ఆ డెత్ గేమ్ ఏంటి ఆడొద్దంటే ఎందుకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.? రాష్ట్రంలో ఈ గేమ్ బారిన పడి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి.?

పబ్ జీ గేమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగానే ప్రాణాంతకమైన గేమ్‌గా మారింది. స్మార్ట్ ఫోన్లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. టీనేజర్లు పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవుతున్నారు. స్మార్ట్ ఫోన్ దొరికితే పిల్లలు గంతులేసుకుని పబ్ జీ గేమ్ ఆడుతుంటే వారి తల్లిదండ్రులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు.ఈ గేమ్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది పిల్లలు, యువకులు తమ ప్రాణాలు తీసుకోవడంతో.. తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ గేమ్ ను నిషేధించాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.

పబ్ జీ గేమ్ చాలా డేంజరస్ గేమ్‌గా చెబుతున్నారు. మానసిక వైద్య నిపుణులు. స్మార్ట్ ఫోన్లకు దూరంగా పిల్లలను ఉంచాలని సూచిస్తున్నారు. ఈ గేమ్ ఆడటం వలన డిప్రెషన్ కు గురై విచక్షణ కోల్పొతున్న సందర్భాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఈ గేమ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్యులు డాక్టర్ కేశవులు సూచిస్తున్నారు. ఆ మాయదారి ఆటలో పడ్డ చిన్నారులు తల్లిదండ్రులతో పాటు బయట ప్రపంచానికి దూరం అవుతున్నారు. ఈ డెత్ గేమ్‌ బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories