శిధిలావస్ధకు చేరుకున్న ఉస్మానియా ఆసుపత్రి

శిధిలావస్ధకు చేరుకున్న ఉస్మానియా ఆసుపత్రి
x
Highlights

కోట్లాది మందికి ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న ఆ చారిత్రాత్మక ఆసుపత్రి పేరు వింటే డాక్టర్లు గడగడ వణికిపోతున్నారు. రోగులకైతే పై ప్రాణాలు పైనే పోతున్నాయి....

కోట్లాది మందికి ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న ఆ చారిత్రాత్మక ఆసుపత్రి పేరు వింటే డాక్టర్లు గడగడ వణికిపోతున్నారు. రోగులకైతే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వందఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్షంగా ఉన్న ఆ ఆసుపత్రి శిధిలావస్ధకు చేరుకోవడంతో అందరికి భారంగా మారింది.హైదరాబాద్‌కు తలమానికంగా భావించే ఉస్మానియా ఆసుపత్రి శిధిలావస్ధకు చేరుకుందని GHMC అధికారులు నిర్ణయించారు. ఎప్పుడు కూలుతుందో తెలియని స్ధితిని ఉన్న ఆసుపత్రిని తక్షణమే ఖాళీ చేయాంటూ నోటీసుల్లో వివరించారు .

ప్రమాదకర పరిస్ధితులు ఉన్నా అలాగే పని చేయిస్తున్నారంటూ జూనియర్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రోగులకు, ఇటు తమకు ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలో ఆసుపత్రిని మరో చోటుకు మారుస్తామన్న ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకపోవడంతో డాక్టర్స్ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తీరు ఇలానే కొనసాగితే తాము ఆందోళన బాట పట్టక తప్పదంటూ జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. డాక్టర్లు సైతం ఇదే మాట చెబుతూ ఉండటంతో ఉస్మానియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories