Top
logo

హోలీ ఆనందకేళీ

హోలీ ఆనందకేళీ
Highlights

చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాలతో జరుపుకునే రంగుల కేళీ. ఊరూరా, వాడవాడలా, ఇంటింటా రకరకాల రంగులతో...

చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాలతో జరుపుకునే రంగుల కేళీ. ఊరూరా, వాడవాడలా, ఇంటింటా రకరకాల రంగులతో కనువిందు చేసే పర్వదినం హోలీ. కుల మత బేధాలకు అతీతంగా ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకుంటున్నారు.

చిన్నాపెద్దా తేడాలేదు. ముసలీ ముతక బేధం లేదు. ధనిక పేద తారతమ్యం లేదు. బాసు ఎంప్లాయీ డిఫరెన్స్ లేదు. ఆడ మగ దూరం లేదు. హోలీ వచ్చిందంటే అందరూ ఏకమవ్వాల్సిందే. అందరికీ రంగుపడాల్సిందే. రంగుల్లో మునిగి తేలాల్సిందే. ఎందుకంటే హోలీ ఆనందాల కేళీ.

మనదేశంలో ఎన్నో పండగలున్నాయి. ఎన్నో సంస్కృతులు, ఆచారాలున్నాయి. కానీ కులాలు, మతాలకు అతీతంగా, ఆహ్లాదంగా జరుపుకునే పండగ, సాంస్కృతిక సంరంభం హోలీ. చిన్నాపెద్ద అందరూ రంగులు చల్లుకుని పండగ చేసుకుంటారు. ఆనందం అర్ణవమవుతూ, అనురాగం అంబరమవుతూ సప్తవర్ణాల సమ్మేళనంతో జీవితాన్ని రంగుల మయం చేసే పండగ ఇది.

కాలంతో పోటీపడుతూ బిజీబిజీ, గజీబిజీ లైఫ్‌లో కొట్టుకుపోతున్న నేటి మోడ్రన్ హ్యూమన్ బీయింగ్‌కు హోలీ వస్తేనే ఆనందాలు అంచులు చూసేది. కాంక్రీట్ జంగిల్‌లో యాంత్రికంగా సాగిపోయే జీవితానికి కొన్ని హ్యాపీ రంగులు అద్దేది హోలీనే. బాధలు గాధలు, బంద్‌లు ఇబ్బందులు, కష్టాలు నష్టాలు, కోపాలు తాపాలు, టార్గెట్లు అగచాట్లు, పరీక్షలు జీవితం తాలుకూ విషమ పరీక్షలు ఇలా ఎన్నో రంగుల లైఫ్‌కు మరో కలర్ చూపేది హోలీనే.

బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తెలిసిన వారు తెలియని వారు ఇలా అందరూ అందరి మధ్య ఆకాశమే హద్దుగా ఆనందాన్ని సొంతం చేసుకునే పండగ హోలీ. కొత్త అందాలు నింపుకున్న ప్రకృతి సిరులలో తడిసి ముద్దవడానికి ప్రతి ఒక్కరూ తహతహలాడే పండగ ఇది. రంగులను చల్లుకొని, ఉత్సాహాన్ని ఎద నిండా నింపుకుని, చిన్నాపెద్దా తేడా లేకుండా హుషారుగా హోరెత్తించే ఫెస్టివల్ హోలీ. ఈ అందాల ఆనందాల కేళీకి మూలం మన దేశమే.

హోళీ పండగ సమయంలో విదేశీయులు సైతం మనదేశాన్ని చూసి అబ్బురపడతారు. మన రంగుల పండగ గురించి పరిశోధన చేస్తారు. భిన్నత్వాలు ఎన్నున్నా అందర్నీ ఏకం చేస్తున్న హోలీ లాంటి పండగ అందర్నీ అబ్బురపరుస్తుంది. ఉత్తరభారతంలో మహా సంబరంగా జరుపుకునే హోలీ, దక్షిణాదిలో కాసిన్ని రంగులు చల్లి, విదేశాలకు సైతం కలర్స్ అద్దుతోంది.


లైవ్ టీవి


Share it
Top