దేశ రక్షణలో తలెత్తడమే తప్ప ... తల వంచేది లేదు

దేశ రక్షణలో తలెత్తడమే తప్ప ... తల వంచేది లేదు
x
Highlights

దేశం కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడని నైజం అతనిది. కన్నతల్లి కంటే మాతృభూమి గొప్పదిగా భావించే మహోన్నత వ్యక్తిత్వం తనది....

దేశం కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడని నైజం అతనిది. కన్నతల్లి కంటే మాతృభూమి గొప్పదిగా భావించే మహోన్నత వ్యక్తిత్వం తనది. అందుకే చావు దగ్గరకు వచ్చినా అదరలేదు బెదరలేదు. దేశ రహస్యాలు చెప్పమంటూ దాయాదులు దాడి చేసినా వెనక్కు తగ్గలేదు. పోరాట యోధుడి కుటుంబంలో పుట్టిన తాను దేశానికి ద్రోహం చేయలేనన్నాడు. అతనే యావత్‌ భారతానికి ఇప్పుడు హీరో అయ్యాడు.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు యావత్ భారతం ఒకే పేరును స్మరిస్తోంది. అతనే భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ వర్ధమాన్‌. ఉక్కును సైతం తుక్కుగా మార్చే శక్తి శుత్రువుల తుపాకి గుళ్లకు గుండెను అడ్డుగా పెట్టే సాహసం ఇతని సొంతం. అందుకే వర్ధమాన్ ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయల రియల్ హీరో అయ్యాడు. నేటి యువతరానికి ఓ స్పూర్తిగా నిలిచాడు.

పాకిస్ధాన్‌కు చెందిన యుద్ధ విమానాలు భారత గగనతలంలో ప్రవేశించికుండా చేస్తున్న ప్రయత్నంలో అభినందన్ దాయాది దేశానికి చిక్కాడు. దేశ రహస్యాలు చెప్పాలంటూ అభినందన్‌పై దాడి చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయినా ఎక్కడా కన్నీరు పెట్టుకోలేదు. కాపాడమంటూ వేడుకోలేదు. తాను భారతీయుడినే అంటూ భరత మాతాకు జై కొట్టాడు. పాక్ సైన్యానికి చిక్కినప్పటి నుంచి తిరిగి భారత్ చేరుకునే వరకు అభినందన్‌లో ఎక్కడా మార్పు లేదు. దేశ సేవే తన లక్ష్యమని తన నడక ద్వారా అభినందన్ నిరూపించాడు.

తనను బందీగా మార్చుకున్న పాకిస్ధాన్‌ నుంచి విడుదల అయిన సమయంలో భారతీయ సైనికుడి సత్తా ఏంటో ఆచరణలో చేసి చూపాడు అభినందన్‌. తన లక్ష్యం దేశ రక్షణే అంటూ తన హావాభావాల ద్వారా వ్యక్తం చేశాడు. పాకిస్ధాన్‌ భూభాగంలో ఉన్నంత సేపు భారతీయ సైనికుడిగా తన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ గడ్డ మీద కాలు పెట్టగానే చిరునవ్వు చిందించాడు. అందుకే ఈ వీరుడికి యావత్ భారతం వందనం చేస్తోంది అభివందనం చేస్తోంది.

భారతీయ సైనికుడిగా తాను దేశ రక్షణలో తలెత్తడమే తప్ప తల వంచేది లేదని చాటి చెప్పాడు అభినందన్‌. అందుకే చిన్నా, పెద్ద తేడా లేకుండా దేశ నలుమూలల నుంచి అభినందన్‌కు మద్ధతుగా వాఘా సరిహద్దుకు భారతీయులు తరలివచ్చారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఇటు వంటి వీరుడిని కన్న తల్లిదండ్రులకు కూడా ఇదే గౌరవం ఇచ్చారు. యావత్ భారతం ఒకే తాటిపైకి వచ్చి అభినందన్‌కు మద్ధతు ఇవ్వడం ఓ అరుదైన గౌరవం అంటోంది భారతీయ సైన్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories