మనోస్ధైర్యంతో ముందడుగు.. వైకల్యాన్ని జయించిన వీరుడు..

మనోస్ధైర్యంతో ముందడుగు.. వైకల్యాన్ని జయించిన వీరుడు..
x
Highlights

ఆ యువకునికి పుట్టుకతో రెండు చేతులు లేవు అయినా ఏంతో సాధించాలన్నా తపన ఆ యువకున్ని ముందుకు నడిపించింది. వైకల్యం వెక్కిరించిన ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. ...

ఆ యువకునికి పుట్టుకతో రెండు చేతులు లేవు అయినా ఏంతో సాధించాలన్నా తపన ఆ యువకున్ని ముందుకు నడిపించింది. వైకల్యం వెక్కిరించిన ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. చేతులు‌ లేకున్నా అక్షరాలు దిద్దాలనే సంకల్పంతో కాళ్లతో రాయడం నేర్చుకోని‌ డిగ్రీ పట్టా సాధించాడు. అంతేకాదు బైక్ పై స్వారీ చేస్తు చేతులు ఉన్న వారిని సైతం అబ్బరపరుస్తున్నాడు. బ్రతుకు పోరాటానికి వైకల్యం అడ్డరాదంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా యువకునిపై హెచ్ఎంటివి ప్రత్యేక కథనం

కుమ్రంబీమ్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన జాకీర్ పాషాకు పుట్టుకతోనే చేతులు లేవు. చదువు కోవాలన్నా తపనే జాకిర్ ను ముందుకు ‌నడిపించింది ‌కఠోర శ్రమ. చేసి అక్షరాలను‌ కాళ్లతో రాయడం నేర్చుకున్నాడు అలాడిగ్రీ వరకు చదివి డిగ్రీ వరకు చదువుకున్నాడు. పరీక్షలు సైతం కాళ్లతోనే వ్రాసి పాస్ కావడం జాకిర్ పట్టుదలకు నిదర్శనం. రాయడంతో పాటు స్నానం చేయడం, భోజనం‌ చేయడం, తల దువ్వు కోవడం సహా రోజు కార్యక్రమాలన్ని కాళ్లతో చేతుల మాదిరిగా చేసుకుంటున్నాడు జకిర్ పాషా. ఏ ఒక్క పనిలో ఇతరుల మీద ఆధారపడకుండా తనంత తానే స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా అవలీలగా కాళ్లతో బైక్ నడుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ కాలుతో ఓటు వేసి ఎందరికో స్పూర్తి నిచ్చాడు జాకిర్ పాషా..తాను వైకల్యం గురించి బాధపడటం‌లేదని వైకల్యం శరీరానికి తప్ప లక్ష్యం‌ సాధించడానికి ఆటంకం కాదన్నారు. వైకల్యం ఉందని, పరీక్షలు పెయిల్ అయ్యామని ప్రాణాలు తీసుకోకుండా అందరు గర్వించేలా బ్రతకాలని జాకిర్ కోరుతున్నారు.జాకిర్ పాషా తండ్రి వృత్తి రీత్యా అటో డ్రైవర్ చాలిచాలనీ డబ్బులతో కుటుంబ భారాన్ని మోస్తున్న తండ్రి తోడుగా ఉండాలని భావించి కంప్యూటర్ విద్య నేర్చుకుని.. షార్ట్ హ్యాండ్ పూర్తి చేశాడు జాకిర్ పాషా. కంప్యూటర్ జాబ్ వర్క్ చేస్తూ కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకోని పోషిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories