ఎండ దెబ్బకు కుదేలౌతున్న వాహనాలు...జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే....

ఎండ దెబ్బకు కుదేలౌతున్న వాహనాలు...జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే....
x
Highlights

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భానుడి భగబగలతో జనం విలవిలడుతున్నారు రోడ్లు సైతం అగ్నిగుండంగా మారుతున్నాయి. వేడిమికి వాహనాల రంగులు పోవడం, ఇంజన్‌ నుంచి పొగలు...

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భానుడి భగబగలతో జనం విలవిలడుతున్నారు రోడ్లు సైతం అగ్నిగుండంగా మారుతున్నాయి. వేడిమికి వాహనాల రంగులు పోవడం, ఇంజన్‌ నుంచి పొగలు రావడం, పెట్రోలు ఆవిరి కావడం, టైర్లు పంక్చర్‌ అవుతున్నాయి. చాలా మంది పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారు అయితే అదే ఇప్పుడు వాహానాలు దగ్ధం అయ్యేందుకు దారితీస్తున్నాయి.

ఓ వైపు ఎండ తీవ్రతతో జనం అల్లాడుతుండగా మరో వైపు పెరుగుతున్న ఊష్ణోగ్రతలో వాహనాల్లోని ఇందనం కూడా ఆవిరైపోతుంది. వాహనాల్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ రావడం లేదని వాహనదారులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండ వేడిమతో బైకులు కార్లు దగ్దం అవుతున్నాయి వేసవిలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్యాంక్ లో పెట్రోల్ ఎక్కువగా ఉంటే ఎండ వేడిమితో ఎయిర్ లాక్ అవుతున్నాయని చెబుతున్నారు బైక్ మెకానిక్ లు.

వేసవిలో వడదెబ్బ నుంచి ఎన్నో రక్షణ ప్రయత్నాలు చేస్తుంటారు. మనుషులకే కాదు వాహనాలకు కూడా ఎండ తాకిడి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనాల వల్ల ఎండాకాలంలో పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలను సరిగా పట్టించుకోకపోతే మరమ్మతులు చేయించుకోవాల్సి వస్తుంది. ఎండాకాలంలో రంగు వెలసిపోతుంది. పెట్రోలు ఆవిరైపోతుంది. ఇక పెట్రోలు లీకేజీతో మంటలు చెలరేగడం, టైర్ల లో గాలి తగ్గుతుంటాయి.

మనుషులకే కాదు వాహనాలకూ వేసవి కాలంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధిక వేడి ఒక్కో ముఖ్యమైన భాగాన్ని కబళించేస్తుంది. ఉన్నట్టుండి వాహనం ఇంజిన్ నుంచి పొగలు సెగలు కక్కుతుంటాయి. ఎండలతో ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకుంటామో వాహనాలను అంతే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత వాహనాదారులపై ఉంది. ఎండాకాలంలో వాహనాల నిర్వహణపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి.

బండి లోని పెట్రోల్ మాత్రమే ఆవిరై పోవడం కాదు మనిషి ప్రాణాలు కూడా గాల్లో కలిసి పోయే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. తీవ్రమైన ఎండ ఉన్నటు వంటి ఈ సమయంలో బైకులు, కార్లు పేలిపోతున్నాయి. చలికాలం, వర్షాకాలంలో కూడా జరిగే ఈ ‏‏‏‏‏‏‏‏‏ఘటనలు ఇక ఎండాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం మరీ ఎక్కువ ఉంటుంది. ట్యాంక్ లో పెట్రోల్ ఎక్కువగా ఉంటే ఎండ వేడిమి తగిలి ఎయిర్ లాక్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు మెకానిక్ లు. ఎండా కాలంలో వాహనాలకు ఇబ్బంది కలగ కుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు అని చెబుతున్నారు మెకానిక్‌ లు. ఎండా కాలంలో ఎండ నుంచి రక్షించుకోలని చూసే మనం మన వాహనాలను కూడా నీడలో పార్కింగ్ చేయడం లాంటివి చేస్తూ కాపాడుకోవాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories