రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి సినీ తారలు

రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి సినీ తారలు
x
Highlights

రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి తారలు రావడం కొత్తేమీ కాదు సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టడం లేదా ఏదో పార్టీల తరపు నుంచి పోటీ చేయడం ఎప్పటినుంచో...

రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి తారలు రావడం కొత్తేమీ కాదు సినీనటులు రాజకీయ పార్టీలు పెట్టడం లేదా ఏదో పార్టీల తరపు నుంచి పోటీ చేయడం ఎప్పటినుంచో వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అభిమానులే అండగా కొందరు తారలు ఎన్నికల బరిలో దిగి సూపర్ హిట్ అవ్వాలని సినీ చరిష్మాతో రాజకీయాలలో రాణించాలనుకుంటున్నారు. అలాంటి కొంతరు తారలను ఇప్పుడు చూద్దాం.

సినీతారలు రాజకీయాలకు కొత్త కాదు భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన ప్రముఖులెందరో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ. తమిళనాట అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకే పార్టీలు కూడా ఒకప్పుడు సినీకళాకారులు స్థాపించినవే. అభిమానులే అండగా కొంత మంది తారలు పార్టీలు పెట్టి హిట్ అయితే మరి కొందరు సరిగ్గా పార్టీని నడపలేక ప్లాపులు మూటగట్టుకున్నారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం 1940లోనే మొదలైంది. తమిళనాట ఎంజీఆర్‌, జయలలిత, కరుణానిధి, తెలుగు సీమలో జగ్గయ్య, ఎన్టీఆర్‌, కృష్ణ, జమున నుంచి బాలకృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ, రోజా వరకు బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా, హేమ మాలిని, కిరణ్‌ ఖేర్‌ ఇలా ఎందరో తారలు లోక్‌సభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ తమ వాణి వినిపించారు. వీరిలో కొందరు పెద్దల సభలోఅడుగు పెట్టారు.

ఈ సారి కూడా అనేక మంది తారలు ఎన్నికల బరిలో దిగుతున్నారు. కమల్ హాసన్, పవన్ కల్యాణ్ లాంటి వారు పార్టీలు కూడా పెట్టారు. మెగా బ్రదర్ నాగబాబు జనసేన అభ్యర్థిగా నరసాపురం బరిలో నిలిచారు. ఇక తృణమూల్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఈ సారి ఐదుగురు తారలకు లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. ఎన్నికల్లో ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తికి టికెట్ కేటాయించారు. జదావ్‌పూర్ నుంచి చక్రవర్తి పోటీ చేయనున్నారు. ఇక మూన్‌మూన్ సేన్‌, శతాబ్ది రాయ్, నస్రత్ సహాన్‌లు, సినీనటుడు దేవ్ బరిలో ఉన్నారు.

ఇక కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్, మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత బరిలోకి దిగుతున్నారు. ఇక మాండ్య నియోజక వర్గం నుంచే సీఎం కుమార స్వామి తనయుడు నిఖిల్ కూడా పోటీ పడుతున్నారు. యూపీ నుంచి బీజేపీ తరపున హేమమాలిని, కాంగ్రెస్ తరపున రాజ్ బచ్చర్ బరిలో ఉన్నారు. ఇక బీహార్ లో కాంగ్రెస్ తరపున శతృఘ్న సిన్హా పట్నా సాహెబ్ నియోజక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. మొత్తానికి తారలు పార్టీలకు ఉన్న ప్రజాదరణ కంటే ప్రజల్లో తమకున్న పాపులారిటీని ఓట్లుగా మల్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మరి వీరిలో గెలిచేది ఎవరో మే నెల లో తేలుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories