25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఆ రెండు పార్టీలు..

25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఆ రెండు పార్టీలు..
x
Highlights

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి కొత్త కూటమి పెట్టుకోవడంతో ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ ఒంటరైపోయింది.

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి కొత్త కూటమి పెట్టుకోవడంతో ఆ రాష్ట్రంలో హస్తం పార్టీ ఒంటరైపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీకి చెక్ పెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముంగిట పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోండా ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను, చెరో 38 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు మాయావతి, అశిలేష్ యాదవ్ ప్రెస్‌మీట్ పెట్టిమరీ అధికారికంగా ప్రకటించారు.

80 స్థానాల్లో 76 స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీలు పోటీ చేయనున్నాయి. మిగిలిన 4 స్థానాలను మాత్రం ఇతర పార్టీలకు వదిలేయాలని నిర్ణయించారు. అందులో, రెండు స్థానాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీ, ఆయన తల్లి సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ ఉన్నాయి. ఆ రెండింటిని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి విడిచి పెట్టాలని నిర్ణయించినట్టు మాయావతి స్పష్టం చేశారు. ఎస్పీ, బీఎస్పీల పొత్తుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని మాయావతి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు ఏమాత్రం కలిసిరాలేదని మాయావతి తెలిపారు. మా ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి తప్పితే అటు వైపు నుంచి మా పార్టీలకు ఓట్లు బదిలీ అవలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే కాంగ్రెస్‌ను దూరంగా ఉంచామని మాయావతి స్పష్టం చేశారు.

మాయావతిని అవమానిస్తే తనను అవమానించినట్టేనని, పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎస్పీ-బీఎస్‌పీ కూటమి ఏర్పాటుకు సహకరించిన మాయావతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల బీజేపీ పాలనలో పేదలు, రైతులు, దళితులు, మహిళలు, పిల్లలపై అకృత్యాలు మితిమీరాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసిందని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్ లో ఉప్పు-నిప్పుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీలు మళ్లీ 25 ఏళ్ల తర్వాత కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు జతకట్టడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories