Top
logo

బాలకృష్ణకు చేదు అనుభవం

బాలకృష్ణకు చేదు అనుభవం
X
Highlights

ఎన్నికల ప్రచారంలో అధికార టీడీపీ అభ్యర్థులను ప్రజలు అడగడుగునా నిలదీస్తున్నారు. ఐదేండ్ల పాలనపై ఎం చేశావ్ అని...

ఎన్నికల ప్రచారంలో అధికార టీడీపీ అభ్యర్థులను ప్రజలు అడగడుగునా నిలదీస్తున్నారు. ఐదేండ్ల పాలనపై ఎం చేశావ్ అని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రముఖ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్టకి చేదు అనువభం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణకు గురువారం చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే బాలయ్యకు స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చారని బాలయ్యని నిలదీశారు అక్కడి ప్రజలు. దీంతో కంగుతిన్న బాలకృష్ణ స్థానిక టీడీపీపై చిందులు తొక్కారు. ఇన్ని రోజులుగా సమస్య ఎందుకు పరిష్కరించలేదని మండిపడ్డారు. నియోజకవర్గానికి అతిథిలా వచ్చిపోయే బాలయ్య తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే ఎమ్మెల్యే బాలకృష్ణకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Next Story