అందుకే రాజీనామా చేశా: సోమిరెడ్డి

అందుకే రాజీనామా చేశా: సోమిరెడ్డి
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలంతా పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా ప్రచారానికి సరిగ్గా వారం రోజులే గడువు ఉండటంతో...

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలంతా పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా ప్రచారానికి సరిగ్గా వారం రోజులే గడువు ఉండటంతో అగ్రనేతలంతా కధనరంగంలోకి దిగిపోతున్నారు. అభివృద్ధి పనులపై నమ్మకంతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగిందని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని మాచర్లవారిపాళెం, మల్లికార్జునపురం, ఈదూరు, వరకవిపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రమోహన్ రెడ్డి తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో ఎవరికీ ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత చంద్రబాబుదేనని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories