ఐదోసారి అదృష్టన్ని పరిక్షించుకోనున్న ఏపీ మంత్రి.. ఓడితే కెరీర్ ముగిసినట్టేనా ?

ఐదోసారి అదృష్టన్ని పరిక్షించుకోనున్న ఏపీ మంత్రి.. ఓడితే కెరీర్ ముగిసినట్టేనా ?
x
Highlights

రాజకీయ రంగంలో గెలుపు ఓటమి ఇవి సర్వసహజమే. అయితే వరుసపెట్టి అదే పనిగా నాలుగు సార్లు ఎన్నికల్లో ఓటమిపాలైతే కాస్తా ఇబ్బంది అనే చెప్పాలి మరీ. కాగా తనదైన...

రాజకీయ రంగంలో గెలుపు ఓటమి ఇవి సర్వసహజమే. అయితే వరుసపెట్టి అదే పనిగా నాలుగు సార్లు ఎన్నికల్లో ఓటమిపాలైతే కాస్తా ఇబ్బంది అనే చెప్పాలి మరీ. కాగా తనదైన మాట తీరుతో ఓడినా కానీ తెలుగుదేశం పార్టీలో తన హావా మాత్రం తగ్గకుండా ఉన్న నాయకుడు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 1999 తరువాత ఇప్పటివరకు మళ్లీ అసెంబ్లీ ముఖంకూడా చూడలేదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నాలుగు అంటే వరుసగా నాలుగు సార్లు ఎన్నికల బరిలో దిగినా కానీ ప్రజలు మాత్రం కనికరించలేదనే చెప్పాలి. నాలుగు సార్లు అంటే ఓడిపోయినా ఈ సారి కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోవాడానికి మళ్లీ ఎన్నికల రణరంగంలోకి అడుగుపెడుతున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

ఐదోసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలగా ఉన్నారు సోమిరెడ్డి. సర్వేపల్లి నుంచి 2004, 2009, 2014లో పోటీ చేసి ఓడిన సోమిరెడ్డి, 2012 ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి పోటీ చేసిన ఓటమి పాలఅయినా విషయం తెలిసిందే కాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకుని నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మొత్తానికి వ్యవసాయశాఖ మంత్రిగా మంచీ ఛాన్స్ కొట్టేసిన సోమిరెడ్డి ఈ సారి సర్వేపల్లి నుంచి కచ్చితంగా గెలిచి పసుపు జెండా రేపరేపలాడించలని అనుకుంటున్నాడు సోమిరెడ్డి. మరీ ఈసారి కూడా ఓడిపోతే తన రాజకీయ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సోమిరెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈసారి నెగ్గుతారా లేక పక్కకు తప్పుకుంటారా అనేది ఈనెల 23 తేదీ వరకు ఆగల్సిందే.ఐదోసారి తన అదృష్టన్ని పరిక్షించుకోనున్న ఏపీ మంత్రి.. ఓడితే కెరీర్ ముగిసినట్టేనా ?ఐదోసారి తన అదృష్టన్ని పరిక్షించుకోనున్న ఏపీ మంత్రి.. ఓడితే కెరీర్ ముగిసినట్టేనా ?

Show Full Article
Print Article
Next Story
More Stories