logo

అమేథీ ప్రజలు రాహుల్‌ను ఓడిస్తారు...: స్మృతి ఇరానీ

అమేథీ ప్రజలు రాహుల్‌ను ఓడిస్తారు...: స్మృతి ఇరానీ

అమేథీలో గెలవలేననే రాహుల్‌ వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారని స్మృతి ఇరానీ విమర్శించారు. అమేథీకి రాహుల్‌ ఏం చేశారో అక్కడి ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. అమేథీలో రాహుల్‌ పట్ల వ్యతిరేకత పెరిగిందని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్మృతి ఇరానీ తెలిపారు. కాగా రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు ఈసారి కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top