చిరాకు , కోపం ఎక్కువగా వస్తుందా ? అయితే మీరు సరిగ్గా నిద్ర పోవడం లేదన్నట్టే .. !

చిరాకు , కోపం ఎక్కువగా వస్తుందా ? అయితే మీరు సరిగ్గా నిద్ర పోవడం లేదన్నట్టే .. !
x
Highlights

ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం .. కానీ పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం పలు కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు అనేవి ఏర్పడతాయి....

ప్రతి మనిషికి నిద్ర అనేది చాలా అవసరం .. కానీ పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం పలు కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో ఉంటారని తెలిపింది. సాధారణంగా అలసిపోతే చికాకు కనిపిస్తుంది.

అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగానే తమ ప్రతాపాన్ని ఎదుట వారిపై చూపిస్తారని పరిశోధనల్లో తేలింది. కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే. నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోవాలి. కడుపు సరిపడా పౌష్టికాహారం తినండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, సరదాగా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories