Top
logo

కథువా రేప్‌ కేసు: ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు

కథువా రేప్‌ కేసు: ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
X
Highlights

జమ్మూకాశ్మీర్ కథువాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో పఠాన్ కోట్ కోర్టు తీర్పును ప్రకటించింది....

జమ్మూకాశ్మీర్ కథువాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో పఠాన్ కోట్ కోర్టు తీర్పును ప్రకటించింది. మొత్తం ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పును ఇవాళ న్యాయస్థానం వెల్లడించింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్‌ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. దీంతో పంజాబ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గట్టి చర్యలు చేపట్టారు.

Next Story