అన్ని కోణాల్లో దర్యాప్తు :స్టీఫెన్‌ రవీంద్ర

అన్ని కోణాల్లో దర్యాప్తు :స్టీఫెన్‌ రవీంద్ర
x
Highlights

డేటా చోరీ కేసు విచారణను తెలంగాణ సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే సీజ్ చేసిన మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసింది....

డేటా చోరీ కేసు విచారణను తెలంగాణ సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే సీజ్ చేసిన మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసింది. సాంకేతిక నిపుణుల సాయంతో ఆరుగంటల పాటు డేటాను సిట్ బృందం పరిశీలించింది. డేటా చోరీ కేసులో సీజ్ చేసిన ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సిట్‌ బృందం సోదాలు నిర్వహించింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో కార్యాలయాన్ని తెరిచి క్లూస్‌ టీమ్‌తో కలిసి సిట్ బృందం తనిఖీలు చేసింది. ఐటీ గ్రిడ్స్‌ నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులను బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ నిపుణుల సాయంతో సిట్ అధికారులు పరిశీలించారు. అందులో ఉన్న డేటా ఏంటి? రోజువారి డేటాతో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారన్న దానిపై విశ్లేషించారు.అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్‌కుమార్ హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామని సిట్ చీఫ్‌ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. పోలీసులు సీజ్ చేసిన పత్రాలు, డివైజ్‌లను న్యాయస్థానానికి సమర్పిస్తామని చెప్పిన స్టీఫెన్‌ రవీంద్ర ఫామ్-7 దరఖాస్తులపై ఏపీ సిట్ తమను సంప్రదించలేదని తెలిపారు. మొత్తానికి డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసును ఏ విధంగా ఛేదిస్తారు..? ఇది ఆఖరికి ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories