సిద్దిపేట జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పరంపర

సిద్దిపేట జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పరంపర
x
Highlights

సిద్దిపేట జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పరంపర కొనసాగుతోంది. వీలైనన్ని చోట్ల ఏకగ్రీవం అయ్యేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు ఎమ్మెల్యేలు. బరిలో...

సిద్దిపేట జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పరంపర కొనసాగుతోంది. వీలైనన్ని చోట్ల ఏకగ్రీవం అయ్యేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు ఎమ్మెల్యేలు. బరిలో నిలిచిన అభ్యర్థులతో నేరుగా మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ జోరందుకుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో 227 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పది ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా అందులో 9 సిద్దిపేట నియోజకవర్గానికి చెందనవి కావడం విశేషం. మొత్తం 96 ఎంపీటీసీ స్థానాల్లో పది ఏకగ్రీవం కాగా 86 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏకగ్రీవాల విషయంలో బుజ్జగింపులు బాగానే పనిచేస్తున్నాయని చెప్పొచ్చు.

బరిలో నిలిచిన అభ్యర్థులతో ఎమ్మెల్యేలు నేరుగా మాట్లాడి వారిని బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటామని, ఏకగ్రీవం చేసి ఆదర్శంగా నిలవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో మాజీ మంత్రి హరీశ్ రావు పావులు కదుపుతున్నారు. వీలైనన్ని చోట్ల ఏకగ్రీవం చేసేందుకు చొరవ తీసుకుంటున్నారు.

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఉన్న 12 ఎంపీటీసీ స్థానాల్లో జూకల్‌ ఏకగ్రీవం అయ్యింది. జూకల్‌ స్థానం టీఆర్ఎస్ వశం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరో ఆరు స్థానాలు గెలుచుకుని ఎంపీపీ పీఠం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. మొత్తంగా మూడు విడతలలో కలిసి మరిన్ని ఎకగ్రీవాల దిశగా అడుగులు వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories