Top
logo

సిద్దిపేట జిల్లాలో రైలుగా మారిపోయిన పాఠశాల భవనం

సిద్దిపేట జిల్లాలో రైలుగా మారిపోయిన పాఠశాల భవనం
X
Highlights

ఓ ఐడియా జీవితాలను మార్చేస్తోంది. అచ్చం ఇలాంటి ఐడియానే పిల్లలను బడిబాటపట్టేలా చేసింది. ఓ టీచర్‌కు వచ్చిన నయా ఆలోచనకు పిల్లలు ఫిదా అవుతున్నారు. అంతేకాక బుద్దిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ టీచర్‌ ఆలోచనకు పిల్లలకు లింకేంటో తెలియక కన్ఫూజ్‌ అవుతున్నారా ఇంకేందుకు ఆలస్యం ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే ఈ స్టోరీకి ఎంటర్‌ కావాల్సిందే.

ఓ ఐడియా జీవితాలను మార్చేస్తోంది. అచ్చం ఇలాంటి ఐడియానే పిల్లలను బడిబాటపట్టేలా చేసింది. ఓ టీచర్‌కు వచ్చిన నయా ఆలోచనకు పిల్లలు ఫిదా అవుతున్నారు. అంతేకాక బుద్దిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ టీచర్‌ ఆలోచనకు పిల్లలకు లింకేంటో తెలియక కన్ఫూజ్‌ అవుతున్నారా ఇంకేందుకు ఆలస్యం ఈ గందరగోళానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే ఈ స్టోరీకి ఎంటర్‌ కావాల్సిందే. ఉపాద్యాయుడి ఆలోచన ఆ పాఠశాల రూపురేఖలే మార్చేసింది. ప్రభుత్వ పాఠశాల భవనం కాస్తా రైలుగా మారిపోయింది. రైలు ఇంజిన్‌ ప్రిన్సిపాల్‌ గది, రైలు బోగీలే తరగతి గదులు, పిల్లలు ఆడుకునే మైదానం రైల్వే ప్లాట్‌ఫామ్‌గా కనిపిస్తుంది. కాంపౌండ్‌ వాల్‌ని గూడ్స్‌ రైలుగా మార్చి వాటిపై స్ఫూర్తిదాయక కొటేషన్లు రాయడం పలువురిని ఆకర్సిస్తోంది.దీంతో సిద్దిపేట జిల్లా బుస్సాపూర్‌లో విద్యార్థులు రైలెక్కి మరీ అక్షరాలు దిద్దుతున్నారు.

గ్రామంలో ఎవరూ సర్కారీ బడివైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పాటు కార్పొరేట్‌ బాటపట్టడంతో విద్యార్ధుల సంఖ్య తగ్గింది. దీంతో ప్రధానోపాధ్యాయుడు మనోహార్ నయా ఆలోచనతో పాఠశాలలోని తరగతి గదులనే బోగీలుగా మలిచి రైలు బండిగా మార్చేశారు. పిల్లల అభిరుచి మేరకు ఓ చిత్రాకారుడితో గది గోడలపై రైలు ఇంజిన్ తోపాటు బోగీలను పెయింటింగ్ వేయించాడు. రైలు బండి కాన్సెప్ట్ చిన్నారులకు తల్లిదండ్రులకు బాగా కనెక్ట్‌ కావడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతున్నాడు. బడి కాస్తా రైలు బండిలా మార్చడంతో పిల్లలువారి తల్లిదండ్రులు సంతోష పడుతున్నారు. హుషార్‌గా స్కూల్‌కు వచ్చి బుద్దిగా చదువులు నేర్చుకుంటున్నారని చెబుతున్నారు. రైలును తలపిస్తున్న స్కూల్‌లో చదువుకోవడం హ్యాపీగా ఉందని విద్యార్ధులు చెబుతున్నారు. అంతేకాక చుక్‌ చుక్‌ రైలు వచ్చింది. చదువులను మోసుకొచ్చిందంటూ పాటలు కూడా పాడుకుంటున్నారు పిల్లలు. వినూత్న ఆలోచనతో రైలును మరిపించేలా పాఠశాల గోడలకు పెయింటింగ్‌ వేయించిన టీచర్‌ను స్ధానికులు తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాక స్కూల్‌ గోడలపై వేసిన పలు చిత్రాలు విద్యార్ధులను మేధావులను ఆకర్షిస్తున్నాయని కొనియాడుతున్నారు.

Next Story