Top
logo

బంగ్లా పీఠం హసీనాదే..

బంగ్లా పీఠం హసీనాదే..
X
Highlights

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోరులో ప్రధాని షేక్ హసీనాకు చెందిన అధికార మహాకూటమి ఘన విజయం సాధించింది. మొత్తం పార్లమెంట్‌లోని 300 స్థానాలకు అవామీ లీగ్ నేతృత్వంలోని కూటమి 288 సీట్లను గెలుకుందని ఎన్నికల సంఘం కార్యదర్శి హిలాలుద్దీన్ అహ్మద్ సోమవారం అధికారికంగా ప్రకటించారు.

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోరులో ప్రధాని షేక్ హసీనాకు చెందిన అధికార మహాకూటమి ఘన విజయం సాధించింది. మొత్తం పార్లమెంట్‌లోని 300 స్థానాలకు అవామీ లీగ్ నేతృత్వంలోని కూటమి 288 సీట్లను గెలుకుందని ఎన్నికల సంఘం కార్యదర్శి హిలాలుద్దీన్ అహ్మద్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. హింసాయుత అల్లర్ల వాతావరణం మధ్య ఆదివారం ఎన్నికలు నిర్వహించగా మొత్తాని ఓట్లు లెక్కింపు సోమవారం ముగిసిందని తెలిపారు. కాగా పోలైన ఓట్లలో అధికార మహాకూటమి 82 శాతం సాధించి 96శాతం సీట్లను గెలుపొందిందని తెలిపారు. కాగా ప్రతిపక్ష జాతీయ ఐక్య ఫ్రంట్ 'ఎన్‌యూఎఫ్' 15శాతమే ఓట్లతో కేవలం ఏడు సీట్లతో సరిపెట్టుకుందని తెలిపారు. కాగా ఇతరులు ముచ్చటగా మూడు సీట్లను కైవసం చేసుకున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర హసీనాకు ఫోన్ చేసి ఎన్నికల్లో ఘన విజయంపై హసీనాకు అభినందనలు తెలియజేశారు. మొత్తానికి నాలుగోసారి బంగ్లా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుంది హసీనా మోదీ షేక్ ఆ పదవిలో వరుసగా మూడోసారి కొనసాగతున్నారు.

Next Story