డాన్ పాత్రలో శర్వానంద్ : రణరంగం ఫస్ట్ లుక్ వచ్చేసింది

డాన్ పాత్రలో శర్వానంద్ : రణరంగం ఫస్ట్ లుక్ వచ్చేసింది
x
Highlights

పడి పడి లేచే మనసు సినిమా తర్వాత హీరో శర్వానంద్ సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. అయితే అ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్...

పడి పడి లేచే మనసు సినిమా తర్వాత హీరో శర్వానంద్ సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. అయితే అ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చేసింది .. దీనితో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఇక లుక్ విషయానికి వస్తే చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ లెక్కన శర్వానంద్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా ఎదిగి తన జీవితంలోని కీలక దశలను ఎలా దాటాడు అనే దాని మీద రణరంగం ఉండబోతున్నట్లు తెలుస్తుంది ..

ఇందులో కాజల్ అగర్వాల్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 1990 ప్రాంతంలో వైజాగ్ లో మొదలైన రణరంగం విదేశాలకు వెళ్లి తన కనుసైగతో ప్రపంచ నేర సామ్రాజ్యాన్ని శాశించే స్థాయికి ఎలా తీసుకెళ్ళింది అనే ప్లాట్ మీద రణరంగం రూపుదిద్దుకున్నట్టుగా టాక్. సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఇటీవలే జెర్సీతో సూపర్ సక్సెస్ అందుకున్న సితార బ్యానర్ నిర్మిస్తోంది. ఆగస్ట్ 2 డేట్ లాక్ చేస్తూ ఇందులోనే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సాహో కంటే పదమూడు రోజులు ముందుగా శర్వా రణరంగం బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతోంది



Show Full Article
Print Article
Next Story
More Stories