తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు..

తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు..
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ కేసులో సీబీఐ నోటీసులను సవాల్‌చేస్తూ...

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనాచౌదరికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ కేసులో సీబీఐ నోటీసులను సవాల్‌చేస్తూ సుజనా వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రుణాల ఎగవేత కేసులో సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. మే 27, 28 తేదీల్లో సీబీఐ ముందు హాజరుకావాలని సుజనాకు హైకోర్టు సూచించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సూచించింది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య లంచ్ బ్రేక్ ఇవ్వాలని తెలిపింది. సుజనాను అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు మే 27, 28 తేదీల్లోనే విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వులిచ్చింది. విచారించే సమయంలో సుజనాచౌదరి వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని సీబీఐకి తేల్చిచెప్పింది. ఈ కేసు విచారణ సందర్భంగా వాంగ్మూలం మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories