నాడు కేసీఆర్‌.. నేడు చంద్రబాబు... అవే మాటల తూటాలు!

నాడు కేసీఆర్‌.. నేడు చంద్రబాబు... అవే మాటల తూటాలు!
x
Highlights

అవే సీన్లు అవే ఆరోపణలు, అవే ప్రత్యారోపణలు, వాగ్దాటులు అప్పుడు ఇప్పుడు సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయి కానీ ప్లేసు, పర్సన్లు మారారు అప్పుడు తెలంగాణ సీఎం...

అవే సీన్లు అవే ఆరోపణలు, అవే ప్రత్యారోపణలు, వాగ్దాటులు అప్పుడు ఇప్పుడు సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నాయి కానీ ప్లేసు, పర్సన్లు మారారు అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని సెంటిమెంటుతో ఓట్లు పంట పండిచుకుంటే ఇప్పుడు చంద్రబాబూ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

నాలుగు నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం జరిగిందో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవే సీన్లు జరుగుతున్నాయి మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని నాడు కేసీఆర్ సెంటిమెంటుతో ఓట్లు పండించుకుంటే ఇప్పుడు చంద్రబాబూ అదే బాటలో పయనిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుని టార్గెట్‌ చేసిన కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు బీఫారాలు అమరావతి నుంచే ఇస్తున్నారు. మహాకూటమిని గెలిపిస్తే అమరావతి నుంచి పరిపాలన సాగుతుంది అని ఆరోపించా రు. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూడా కేసీఆర్‌ ఆదేశాలతోనే జగన్‌ అభ్యర్థులకు బీఫారాలిస్తున్నారని వైసీపీ గెలిస్తే పాలన హైదరాబాద్‌ నుంచే సాగుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు మోచేతి నీళ్లు తాగాలా? అని కేసీఆర్‌ నాడు ఆగ్రహంగా అంటే 'కేసీఆర్‌కు బానిసలుగా బతకాలా' అని బాబు నిలదీస్తున్నారు. బాబు తెలంగాణకు అన్యాయం చేశాడని కేసీఆర్‌ ఆరోపిస్తే కేసీఆర్‌ ఆంధ్రకు అన్యాయం చేసేందుకే చూస్తున్నారని బాబు మండిపడుతున్నారు. మొత్తానికి నాడు కేసీఆర్ నేడు చంద్రబాబు సెంటిమెంటుతో ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories