logo

కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదు - చిదంబరం

కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదు - చిదంబరం
Highlights

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోండా ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను, చెరో 38 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ పొత్తుపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలయింది.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోండా ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 80 స్థానాలకుగాను, చెరో 38 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ పొత్తుపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలయింది. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ పొత్తుపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదని చిదంబరం అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉత్తర ప్రదేశ్‌లో పొత్తుల విషయంలో మార్పులు జరగవచ్చని తాను ఆశిస్తున్నానని చిదంబరం అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒంటరిగానైనే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని, అంతిమంగా బీజేపీ ఓటమి దిశగానే తమ ప్రయత్నం ఉంటుందని చిదంబరం అన్నారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ ల మధ్య కుదిరిన లోక్‌సభ సీట్ల ఒప్పందాన్ని సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి స్వాగతించారు. ఎస్పీ, బీఎస్పీల పొత్తు బీజేపీకి మింగుడు పడని అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top