Top
logo

ముగిసిన రెండో విడత పోలింగ్

ముగిసిన రెండో విడత పోలింగ్
X
Highlights

తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. రెండో ...

తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,342 సర్పంచి స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరిగింది. అయితే నిర్ణీత సమయంలోపు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.

జిల్లాల వారిగా నమోదైన పోలింగ్‌ శాతం

ఖమ్మం 73.35 శాతం

నల్లగొండ 65 శాతం

సూర్యపేట 77 శాతం

పెద్దపల్లి 67.30 శాతం

రంగారెడ్డి 65.3 శాతం

కరీంనగర్‌ 64 శాతం

యాదాద్రి 63 శాతం

కామరెడ్డి 81.78 శాతం

నిజామాబాద్‌ 69.38 శాతం

వనపర్తి 80 శాతం

నాగర్ కర్నూల్ 76 శాతం

జోగులాంబ గద్వాల 78 శాతం

Next Story