ప్రశాంతంగా ముగిసిన రెండో విడుత పరిషత్ ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన రెండో విడుత పరిషత్ ఎన్నికలు
x
Highlights

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 179 జెడ్పీటీసీ,...

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మినహా 31 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలతో ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాబల్యం ఉన్న 218 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఉదయం పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు తీవ్ర ఎండ కారణంగా మధ్నాహ్నం ఇళ్లకే పరిమితమయ్యారు. కాస్త ఎండ తగ్గిన తర్వాతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో విడత పరిషత్ ఎన్నికల్లో 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,146 మంది, 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది బరిలో ఉన్నారు. రెండో విడుతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories