logo

టీడీపీలో అసమ్మతి సెగలు

టీడీపీలో అసమ్మతి సెగలు
Highlights

అధికార టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంత్రులు, విప్‌‌లు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా...

అధికార టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మంత్రులు, విప్‌‌లు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యతిరేక వర్గాలు ఆందోళనలు దిగుతున్నాయి. ఆయా నేతలకు మళ్లీ టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడగొడతామంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్‌, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డికి వ్యతిరేకంగా వడ్డెరలు ఆందోళనకు దిగారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు నిరసన చేపట్టిన వడ్డెరలు ఈసారి మల్లెల జయరామ్‌కి పుట్టపర్తి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ముద్దు పల్లె వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. 60వేల మంది వడ్డెరలు ఉన్న పుట్టపర్తి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మల్లెల జయరామ్‌కి టికెట్‌ ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. పల్లె రఘునాథ్‌రెడ్డి పరిస్థితి ఇలాగుంటే, మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు సీటు ఇవ్వొద్దంటూ ఎమ్మెల్సీ దీపక్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. తమను కాదని కాల్వకు సీటిస్తే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని మెట్టు గోవింద్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారగా మంత్రి కాల్వ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

తెలుగుదేశంలో పరిణామాలు మంత్రులు, ఎంపీలుచ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల్లో సెగలు పుట్టిస్తున్నాయి. సాక్షాత్తూ కొందరు మంత్రుల సీట్లకే ఎసరు వస్తుండటంతో అవాక్కవుతున్నారు. దర్శి ఎమ్మెల్యే, మంత్రి శిద్ధాను ఒంగోలు పార్లమెంట్‌ నుంచి బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తుండగా, శిద్ధా మాత్రం ససేమిరా అంటున్నారు. అలాగే మరో మంత్రి గంటా పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. అనకాపల్లి లేదా విశాఖ నుంచి పోటీ చేయాలని బాబు కోరుతుండగా, గంటా మాత్రం అసెంబ్లీకే మొగ్గుచూపుతున్నారు. వీళ్లిద్దరితోపాటు మరో ఇద్దరు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, జవహర్‌లు కూడా సొంత నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అలాగే స్పీకర్ కోడెల సీటు పంచాయతీ కూడా ఇంకా తేలటం లేదు. కోడెలను నర్సరావుపేట పార్లమెంట్ బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తుంటే ఆయన మాత్రం తనకు ఎమ్మెల్యే టికెట్టే కావాలని డిమాండ్ చేస్తున్నారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ ను పెడన ఎమ్మెల్యే గా పంపి అక్కడ నుంచ వంగవీటి రాధ ను ఎంపీ గా పోటీ చేయించాలన్నది చంద్రబాబు ప్లాన్ గా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


లైవ్ టీవి


Share it
Top