నేటి నుండి బడులు పున:ప్రారంభం ..

నేటి నుండి బడులు పున:ప్రారంభం ..
x
Highlights

వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలు తెరుచుకున్నాయి.. ఇతకాలం సమ్మర్ హాలిడేస్‌లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు స్కూల్ డ్రెస్సులు ధరించి,...

వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలు తెరుచుకున్నాయి.. ఇతకాలం సమ్మర్ హాలిడేస్‌లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు స్కూల్ డ్రెస్సులు ధరించి, బ్యాగులు వేసుకొని మళ్లీ బడి బాట పట్టారు. తొలుత జూన్‌ 1న తిరిగి బడిగంట మోగుతుందని ప్రభుత్వం ముందుగా ప్రకటించినా ఎండల తీవ్రత దృష్ట్యా జూన్‌ 11 వరకు సెలవులను పొడిగించింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు కొనసాగుతాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి.

ఇక తెలంగాణలో ఈ విద్యా సంవత్సరంలో.... 2020 ఏప్రిల్‌ 23వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించారు. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు. ఈ ఏడాది దసరా సెలవులను సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 13 వరకు ప్రకటించారు. క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 12 నుంచి 28 వరకు ఉంటాయి. 2020 జనవరి 11-16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు. పదో తరగతి విద్యార్థులకు సిలబ్‌సను 2020 జనవరి 10 వరకు పూర్తి చేయాలని నిర్దేశించింది. 1 నుంచి 9 తరగతుల సిలబ్‌సను ఫిబ్రవరి 29 వరకు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ఏపీలో ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో..శనివారం వరకు నాలుగు రోజుల పాటు ఒంటి పూట తరగుతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.. దీనికి సంబంధించి మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ స్పష్టమైన ఉత్తర్వులను విడుదల చేసింది. ఎండలతోపాటు వడగాలులు వీస్తున్న నేపథ్యంలో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories