ఉత్తమ్‌ని తప్పిస్తేనే పార్టీ బతుకుతుంది: సర్వే

ఉత్తమ్‌ని తప్పిస్తేనే పార్టీ బతుకుతుంది: సర్వే
x
Highlights

తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే కాగా తాజాగా ఈ విషయంపై కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ స్పందించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్కమార్కను నియమించడంపై సర్వే సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే కాగా తాజాగా ఈ విషయంపై కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణ స్పందించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్కమార్కను నియమించడంపై సర్వే సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. భట్టికి అధిష్ఠానం ఎంపిక చేయడం చాలా మంచి నిర్ణయమని అన్నారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మరోసారి నిరుపించుకుందని అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు. ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే తప్పకుండా దళితుడు ముఖ్యమంత్రి అయ్యేవాడని సర్వే అభిప్రాయపడ్డాడు. అసలు తెలంగాణ కాంగ్రస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలనీ అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ఉత్త అసమర్థుడని విమర్శించారు. ఉత్తం నాయకత్వాన్ని నమ్ముకుంటే రానున్న లోకసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా కష్టమేనని, ఆయనను తప్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బతుకుతుందని సర్వే వ్యాఖ్యనించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories