నా ముందే కుర్చీలో కూర్చుంటావా? .. 15 దళిత కుటుంబాల బహిష్కరణ

నా ముందే కుర్చీలో కూర్చుంటావా? .. 15 దళిత కుటుంబాల బహిష్కరణ
x
Highlights

కామారెడ్డి జిల్లా జల్దిపల్లి గ్రామ సర్పంచ్‌ దౌర్జన్యంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తనను నిలదీసిన 15 దళిత కుటుంబాలపై గ్రామ సర్పంచ్ సామాజిక...

కామారెడ్డి జిల్లా జల్దిపల్లి గ్రామ సర్పంచ్‌ దౌర్జన్యంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తనను నిలదీసిన 15 దళిత కుటుంబాలపై గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ వేటు వేశారు.దళిత కాలనీలో నీటి సరఫరా నిలిపివేయడంతో పాటు కాలనీలోని వారికి ఎలాంటి సహకారం అందించొద్దని ఆదేశించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో గ్రామంలో విచారణ చేపట్టారు.సర్పంచ్‌ ముందు కుర్చీలో కూర్చున్నందుకే దళితులపై సామాజిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే జల్దిపల్లి గ్రామానికి చెందిన ఓ దళితుడు రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కుర్చీలో కూర్చోవడంతో ఆగ్రహించిన సర్పంచ్‌ కల్లు రవీందర్‌ అతన్ని అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు దూషించాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న పలువురు దళితులు సర్పంచ్‌ రవిందర్‌ను నిలదీయడంతో మరింత కోపంతో రగిలిపోయిన సర్నంచ్ ఏకంగా 15 దళిత కుటుంబాలను బహిష్కరించారు. వారికి ఊరిలో ఎలాంటి సహకారం అందించవద్దని, కిరాణ దుకాణాల్లో వస్తువులు ఇవ్వద్దని గ్రామస్థులను సర్పంచ్ ఆదేశించారు. దీంతో ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిపివేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories