కాంగ్రెస్‌ సర్పంచ్‌ అభ్యర్థి అదృశ్యం

కాంగ్రెస్‌ సర్పంచ్‌ అభ్యర్థి అదృశ్యం
x
Highlights

వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం రేగింది. నియోజకవర్గం పరిధిలోని నిటూరులో సర్పంచ్ అభ్యర్ధి విశ్వనాథ్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు తెల్లవారుజామున కిడ్నాప్‌ చేశారు.

వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం రేగింది. నియోజకవర్గం పరిధిలోని నిటూరులో సర్పంచ్ అభ్యర్ధి విశ్వనాథ్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు తెల్లవారుజామున కిడ్నాప్‌ చేశారు. కాంగ్రెస్ బలపరచిన అభ్యర్ధిగా ఉన్న ఆయన కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది. కాసేపట్లో గడవు ముగుస్తున్నా ఆచూకి తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గ్రామానికి చేరుకుని స్ధానికులతో మాట్లాడారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories