కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్యానా డాన్సర్..

కాంగ్రెస్ పార్టీలో చేరిన హర్యానా డాన్సర్..
x
Highlights

హర్యానాకు చెందిన ప్రఖ్యాత డాన్సర్‌ సప్నా చౌదరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. సీనియర్ నాయకుడు నరేంద్ రాఠి సారథ్యంలో ఆమె ఢిల్లీలో పార్టీ కండువా...

హర్యానాకు చెందిన ప్రఖ్యాత డాన్సర్‌ సప్నా చౌదరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. సీనియర్ నాయకుడు నరేంద్ రాఠి సారథ్యంలో ఆమె ఢిల్లీలో పార్టీ కండువా కప్పుకుంది. మధుర లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగుతుందని కూడా వార్తలు వినిపించాయి. మధురలో బీజేపీ పార్టీ నుంచి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ మాధురి దీక్షిత్‌పై సప్నా చౌదరి పోటీకి దిగుతుందని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదవ జాబితాలో మధుర ఎంపీ టికెట్‌ను మహేష్ పాటక్‌కు కేటాయించడంతో ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి. ఆమె ఎక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తుందనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

సప్నా చౌదరి హర్యానాలో ఈ పేరు తెలియనివారుండరు. హర్యానా రాష్ట్రం మొత్తం తన ఆటపాటలతో అల్లాడించిన ప్రముఖ డాన్సర్ సప్నా చౌదరి. ఏఊరైనా సప్నా వస్తుందంటే చాలు జనం పిచ్చెక్కిపోతారు. ఆమె స్టేజ్ షో కోసం పడిగాపులు కాస్తారు. సప్నా స్టెప్పులేస్తుంటే నోళ్లు తెరుచుకొని చూస్తుండిపోతారు.ఎనిమిదేళ్ల పిల్లాడి నుంచి 80 ఏళ్ల పండు ముసలి వరకు అందరిలోనే ఆమెకు అంతే క్రేజ్. బిగ్ బాస్ షోలో పాల్గొని ఇతర రాష్ట్రాల్లో కూడా క్రేజ్ సంపాదించుకుంది సప్నా. పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిదంది. అలాంటి సప్నా చౌదరి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories