logo

పంతంగి టోల్‌ప్లాజా వద్ద సంక్రాంతి రద్దీ

సంక్రాంతి సంబరాలకు మహా నగర వాసులు బయలుదేరారు. ఆత్మీయుల మధ్య ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ పాత రోజులను గుర్తు చేసుకునేందుకు యావత్ నగరం పల్లెకు బయలుదేరింది.

toll plazatoll plaza

సంక్రాంతి సంబరాలకు మహా నగర వాసులు బయలుదేరారు. ఆత్మీయుల మధ్య ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ పాత రోజులను గుర్తు చేసుకునేందుకు యావత్ నగరం పల్లెకు బయలుదేరింది. దీంతో బస్సులు, కార్లు, ఇతర ప్రజా రవాణా వాహనాలతో హైదరాబాద్ చుట్టుపక్కల రహదారులు క్రిక్కిరిసాయి. హైదరాబాద్ నుంచి ఇటు అనంతపురం వరకు అటు విజయవాడ వరకు ఉన్న అన్ని టోల్ ప్లాజాల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోవడంతో జాతీయ రహదారులపై వాహనాలు బారులు తీరాయి.

శని, ఆది వారాల తరువాత సంక్రాంతి రావడంతో నిన్న సాయంత్రమే నగరవాసులు భారీగా సొంతూర్లకు బయలుదేరారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది. వేలాది వాహనాలు ఒకే సారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు అనూహ్యంగా పెరగడానికి తోడు పొగమంచు భారీగా కురుస్తూ ఉండటంతో ప్రయాణీకులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వెళుతున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

లైవ్ టీవి

Share it
Top