హైటెక్‌ హరిదాసులు... ట్రెండ్‌కు తగ్గట్లు స్టైల్‌ మార్చిన హరిదాసులు

Haridas
x
Haridas
Highlights

సంక్రాంతి సందడి మొదలైంది. మూడ్రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో హరిలో రంగ హరీ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. అలాంటి హరిదాసులు ఈసారి కాస్త టెక్నాలజీకి అనుగుణంగా మారిపోయారు. హరిదాసుల నయాగెటప్‌పై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

సంక్రాంతి సందడి మొదలైంది. మూడ్రోజుల ముచ్చటైన ముగ్గుల పండగలో హరిలో రంగ హరీ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. అలాంటి హరిదాసులు ఈసారి కాస్త టెక్నాలజీకి అనుగుణంగా మారిపోయారు. హరిదాసుల నయాగెటప్‌పై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ స్టోరీ.

ట్రెండ్‌ మారింది. ట్రెండ్‌కు తగ్గట్లు హరిదాసుల స్టైలూ మారింది. ఒకప్పుడు చేతిలో చిడతలు పట్టుకుని గజగజవణికించే చలిలో కాలినడకన చెప్పులు కూడా లేకుండా ఇంటింటికి తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేసిన హరిదాసులు నయా టెక్నాలజీకి కనెక్ట్‌ అయ్యారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీఠ వేస్తూనే వృతిని కాపాడుకుంటున్నారు.

సంక్రాంతి పర్వదినాన వేకువజామునే ఊర్లోకి వచ్చి నెత్తిన అక్షయపాత్ర, ఓ చేతిలో చిడతలు, మరో చేతిలో తంబుర పట్టుకొని భక్తిరసమైన హరికీర్తనలతో కాలినడకన ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు. హరిదాసు ఇంటికి రావడమే ఆలస్యం ప్రతి ఒక్కరు తమకు తోచిన దానం చేస్తుంటారు. దానం స్వీకరించే సమయంలో హరిదాసు వినమ్రంగా కిందకి వంగి నెత్తిన ఉన్న అక్షయపాత్రలో దానాన్ని స్వీకరించి ఆశీర్వదిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో సరికొత్త భిక్షాటనకు శ్రీకారం చుట్టారు హరిదాసులు.

కాలం మారింది హరిదాసుల యాచన తీరూ మారింది. ఇప్పుడంతా హైటెక్‌ వీధివీధినా నడిచే పనిలేకుండా నెత్తిన అక్షయపాత్ర మోయకుండా హరికీర్తనలు సైతం పాడకుండా కొత్త విధానానికి తెరలేపారు. తలపై ఉండాల్సిన అక్షయపాత్రను బైక్‌ హెడ్‌ డూమ్‌ దగ్గర అమర్చుకుని బైక్‌పై ఠీవిగా కూర్చుని ఇల్లిల్లూ తిరిగేస్తున్నారు. నోటికి పనిచెప్పకుండా టేప్‌రికార్డ్, సౌండ్స్‌బాక్స్‌ను పెట్టేసి హరికీర్తనలను ఓ రేంజ్‌లో వినిపిస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ తమపని పూర్తిచేసుకున్నారు.

వయస్సు పెరిగింది తరతరాలుగా వంశ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ వృతిని కొనసాగిస్తున్నామంటున్నారు హరిదాసులు. నడవలేకపోతున్నాము కాబట్టి మనువడి బైక్ ఎక్కి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని అంటున్నాడు. ఏదేమైనా హరిలో రంగ హరీ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అర్టీఫిషియల్‌ గా మారిందని కొందరు అంటుంటే నవతరం హరిదాసు నయా గెటప్‌ సూపర్ అంటున్నారు మరికొందరూ.


Show Full Article
Print Article
Next Story
More Stories