పండుగకు పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. తప్పని ఇక్కట్లు

పండుగకు పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. తప్పని ఇక్కట్లు
x
Highlights

పండక్కి భాగ్యనగరం పల్లె దారి పట్టింది. సంక్రాంతి సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయణమవుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు సొంతూళ్లో సంక్రాంతి జరుపుకునేందుకు రెడీ అయ్యారు.

పండక్కి భాగ్యనగరం పల్లె దారి పట్టింది. సంక్రాంతి సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయణమవుతున్నారు. ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారు సొంతూళ్లో సంక్రాంతి జరుపుకునేందుకు రెడీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి పల్లెల్లో పండుగ జరుపుకోవడంతో పాటు సంక్రాంతి సెలవులను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారు. సంక్రాంతి అంటేనే హైదరాబాద్‌ సిటీ ఖాళీ అయిపోతుంది. రేపటి నుంచి వరుస సెలవులు కావడంతో చాలా మంది ఈ రాత్రికే సొంతూళ్లకు పయణమవుతున్నారు. ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్న వారి సంగతి పక్కన పెడితే పండక్కి ఊరెళ్దామని ఇప్పుడు టికెట్లు బుక్‌ చేసుకుంటున్న వారికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ షాకిస్తున్నాయి. టికెట్‌ ధరలను అమాంతం పెంచేశాయి.

సంక్రాంతికి ఊరెళ్దామంటే రైళ్లలో టికెట్లు దొరకడం లేదు. అన్ని ట్రైన్స్‌‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ వస్తోంది. రైల్వే స్టేషన్లలో రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్‌ అందిస్తారు. అటు, ఆర్టీసీలో కూడా సంక్రాంతి రద్దీ కనిపిస్తోంది. అరకొర బస్సులు, సీట్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీలో పరిస్థితి అలా ఉంటే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఇదే అదనుగా ఇష్టానుసారం దోచేస్తున్నాయి. టికెట్‌ రేట్లను అమాంతం పెంచేసి ప్రయాణికుల జేబులు కొళ్లగొడుతున్నాయి.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికులను దోచుకునేందుకు ఊరించే ఆఫర్లతో చీటింగ్‌ చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వారిని ఆఫర్స్‌ పేరుతో ఆకర్షిస్తున్నాయి. పైకి టికెట్‌ ధరలు తక్కువగా చూపిస్తూ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యాక అత్యధిక ధరలతో చీట్‌ చేస్తున్నాయి. సంక్రాంతి రద్దీ అంటే విజయవాడ వెళ్లే రహదారి జామ్‌ కావాల్సిందే. కారెనకారు అన్నట్టు ట్రాఫిక్‌ నత్తనడకను తలపిస్తుంది. ఎల్బీనగర్‌ దగ్గర ఇప్పటికే స్లోగా సాగుతున్న ట్రాఫిక్‌ రాత్రి 9 గంటలకు ఎక్కడిక్కడ జామ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories