అలాచేస్తే కేసీఆర్‌కు గుడి కట్టిస్తా: జగ్గారెడ్డి

అలాచేస్తే కేసీఆర్‌కు గుడి కట్టిస్తా: జగ్గారెడ్డి
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు తెలంగాణ సర్కార్ గిట్టుబాటు ధర కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న...

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు తెలంగాణ సర్కార్ గిట్టుబాటు ధర కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణాయాన్ని స్వాగతిస్తున్నట్టు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. గురువారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన జగ్గారెడ్డి రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం చాలా అభినందనీయమన్నారు జగ్గారెడ్డి. అయితే తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణాయాన్ని పట్టుమని ఏడాదిలోపే అమలు చేస్తే కేసీఆర్‌కు సంగారెడ్డిలో గుడి కట్టిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. అలాగే తెలంగాణ ఇచ్చిన సోనియా, రాహుల్‌ గాంధీకి కూడా గుడి కట్టిస్తానని ఈ సందర్భంగా చెప్పారు.

గురువారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరి మధ్య ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగురవేస్తుందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. ఇక పొద్దున్న లేస్తే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించే కేసీఆర్ అదే పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకోవడం సిగ్గుచేటని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories