'రెండుసార్లు ఓడితే టికెట్‌ ఇవ్వకండి'

రెండుసార్లు ఓడితే టికెట్‌ ఇవ్వకండి
x
Highlights

లొకసభ ఎన్నికలకు ఆయా పార్టీలు సిద్ధమైవుతున్నాయి. అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి కొన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థుల...

లొకసభ ఎన్నికలకు ఆయా పార్టీలు సిద్ధమైవుతున్నాయి. అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి కొన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థుల వేట మొదలైంది. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా యువతకు టికెట్లు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరంగా లేఖ రాశారు జగ్గారెడ్డి. అయితే వరుసగా రెండు, మూడు మూడుసార్లు ఎన్నికల్లో ఓటమి పాలైన వారికి అసలు టికెట్లు ఇవ్వద్దని రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన వారికి నామినెటేడ్‌ పదవులు ఇవ్వండనీ, కానీ అసలు ఎన్నికల పోరులో గెలిచే సత్తాలేని నాయకులకు మాత్రం టికెట్‌ ఇవ్వొద్దని రాహుల్ గాంధీని కోరారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న యువకులకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని జగ్గారెడ్డి లేఖలో రాశారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా కోసం కసరస్తు చేస్తోన్న నేపథ్యంలో జగ్గరెడ్డి ఈ లేఖ రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories