సంగారెడ్డి జిల్లా మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అదే నిర్లక్ష్యం

సంగారెడ్డి జిల్లా మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అదే నిర్లక్ష్యం
x
Highlights

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మరోసారి తప్పిదం జరిగింది. అక్కడి వైద్యులు, సిబ్బంది తీరు రోజురోజుకు వివాదాస్పదమవుతోంది....

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో మరోసారి తప్పిదం జరిగింది. అక్కడి వైద్యులు, సిబ్బంది తీరు రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. కొద్ది రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో పసిపాప కిడ్నాప్‌కు గురైంది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇందుకు కారణమైన సిబ్బందిని సైతం సస్పెండ్‌ చేశారు. కానీ ఇంత జరిగినా అక్కడి సిబ్బంది తీరులో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. తాజాగా డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ మహిళ నేలపైనే బిడ్డను ప్రసవించింది.

సంగారెడ్డి జిల్లా కల్హేరు మండలం బీబీపేట గ్రామానికి చెందిన స్వాతి డెలివరీ కోసం మాతాశిశు ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు చెప్పిన తేదీ ప్రకారమే నిన్న ఆసుపత్రికి భర్తతో సహా డెలివరీకి వచ్చింది. అయితే ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి వస్తే, మధ్యాహ్నం 3 గంటల వరకు డాక్టర్లు అడ్మిట్‌ చేసుకోలేదు. పైగా మీ ప్రాంతంలో ఆసుపత్రి ఉండగా, ఇంత దూరం ఎందుకు వచ్చారని వైద్యులు కోపం వ్యక్తం చేసినట్టు స్వాతి వాపోయింది. చివరికి నొప్పులు రావడంతో ఆసుపత్రి బయటనే ప్రసవం జరిగినట్టు స్వాతి తెలిపింది.

అయితే ఇదే విషయంపై హెచ్‌ఓడీ గాయత్రిని వివరణ అడగగా, తమ తప్పేమీ లేదని, ఆసుపత్రిలో జాయిన్‌ చేశాకే స్వాతి ప్రసవించినట్టు ఆమె తెలిపారు. మరోవైపు డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందుకే స్వాతి బయటనే డెలివరీ అయ్యిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories