సాయికృష్ణకు అండగా ఉంటాం : కేటీఆర్

సాయికృష్ణకు అండగా ఉంటాం : కేటీఆర్
x
Highlights

అమెరికాలో దుండగుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్‌కు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాయికృష్ణ తల్లిదండ్రులు పూస ఎల్లయ్య, శైలజ దంపతులు ఇవాళ కేటీఆర్‌ను కలిశారు.

అమెరికాలో దుండగుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న మహబూబాబాద్‌కు చెందిన విద్యార్థి సాయికృష్ణకు అండగా ఉంటామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాయికృష్ణ తల్లిదండ్రులు పూస ఎల్లయ్య, శైలజ దంపతులు ఇవాళ కేటీఆర్‌ను కలిశారు. తమ కుమారుడికి అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 3వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అనుకోని పరిణామం సంభవించింది. ఓ మెక్సికన్ ఫుడ్ రెస్టారెంట్‌ దగ్గర కారు ఆపినప్పుడు సాయుధ దుండగులు చొరబడ్డారు. తుపాకులు చూపి బెదిరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

దుండగులు సాయికృష్ణ బట్టలు లాగేసీ కారును తీసుకొని వెళ్లిపోయే ముందు సాయికృష్ణను భయబ్రాంతులకు గురిచేసి నోటిలో తుపాకి పెట్టి కాల్చేశారు దుండగులు. తీవ్రగాయలతో అక్కడే కొట్టుమిట్టాడుతుండగా ఆ దారిపంటి వెళ్తున్న మహిళలు గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అయితే సాయికృష్ణ పరిస్థితి అంతగా బాగాలేదని వెంటనే శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే సాయికృష్ణకు ఆరోగ్యబీమా లేదని కేవలం తన చదువుకు సంబంధించి అప్పులు కూడా ఉన్నట్లు తన మిత్రులు వెల్లడించారు.సాయికృష్ణ తలిదండ్రులు పూజ ఎల్లయ్య, శైలజ. సాయికృష్ణ తన పదవ తరగతి వరకు మహబూబాబాద్‌లోని ఓ ప్రయివేటు బడిలో పూర్తి చేశాడు తరువాత ఇంటర్మీడియట్, బిటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories