logo

ఇవాళ్టితో సహస్ర చండీ యాగం పూర్తి

ఇవాళ్టితో సహస్ర చండీ యాగం పూర్తి
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో జరుగుతున్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగం ఇవాళ్టితో...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో జరుగుతున్న మహారుద్ర సహిత సహస్ర చండీయాగం ఇవాళ్టితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు చండీ పారాయణాలు, మహా రుద్ర పారాయణాలు, భగళాముఖి పారాయణాలు, నవగ్రహ హవనం జరిగాయి. నాలుగో రోజే సహస్ర చండీయాగం పూర్తికాగా చివరి రోజు పూర్ణాహుతితో కార్యక్రమం పరిసమాప్తం కానుంది.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఈ నెల 21 న మొదలైన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నాలుగు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగింది. నాలుగోరోజు కేసీఆర్‌ దంపతులు మొదట రాజశ్యామల మాత మండపంలో పూజలు నిర్వహించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపిణిగా శ్రీరాజశ్యామలాదేవిని అర్చించారు. ఆ తర్వాత మహారుద్ర మండపంలో జరిగిన పూజలో సీఎం దంపతులు పాల్గొన్నారు. మహారుద్రయాగంలో భాగంగా 44 మంది రుత్విక్కులతో 44 ఏకాదశ రుద్ర హోమా లు, ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి. నిన్న రాత్రి స్వామి స్వరూపానేందంద్ర సరస్వతి వారు ఎర్రవల్లికి చేరుకున్నారు. ఇవాళ్టి పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆయన చేతులు మీదుగా నిర్వహిస్తారు.


లైవ్ టీవి


Share it
Top