ఫలించని కాంగ్రెస్ బుజ్జగింపులు.. రేపు టీఆర్‌ఎస్‌లోకి సబిత?

ఫలించని కాంగ్రెస్ బుజ్జగింపులు.. రేపు టీఆర్‌ఎస్‌లోకి సబిత?
x
Highlights

సబితాఇంద్రారెడ్డి చేరిక విషయంలో గులాబీ వ్యూహమే ఫలించింది. సబిత కాంగ్రెస్‌ను వీడకుండా ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రేపు సబితా...

సబితాఇంద్రారెడ్డి చేరిక విషయంలో గులాబీ వ్యూహమే ఫలించింది. సబిత కాంగ్రెస్‌ను వీడకుండా ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రేపు సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. చేవెళ్ల చెల్లెమ్మ గులాబీ పార్టీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు. మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితా తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు విముఖత వ్యక్తం చేయడంతో టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి అసద్ ఇంట్లో కేటీఆర్, ఎంపీ కవితతో చర్చలు జరిపారు. సబిత టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న విషయం తెలుసుకున్న ఉత్తమ్, భట్టి విక్రమార్క సబితా ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆమెను కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డితో సోమవారం రాత్రి చర్చలు జరిపారు. ఆ సమయంలో రాహుల్ గాంధీతో కూడా మాట్లాడించినట్లు తెలిసింది. రాహుల్ ను కలిసేందుకు సబితా ఢిల్లీ వెళ్తారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చివరికి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు టీఆర్ఎస్ లో చేరేందుకే నిర్ణయించుకున్నారు. బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో సబితా టీఆర్ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories