logo

మహిళల ప్రవేశంపై వైఖరి మార్చుకున్న ట్రావెన్‌కోర్‌ బోర్డు‌

మహిళల ప్రవేశంపై వైఖరి మార్చుకున్న ట్రావెన్‌కోర్‌ బోర్డు‌

శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ వాడి వేడి వాదనలు జరిగాయి. మహిళల ప్రవేశాన్ని ఇంతకాలం వ్యతిరేకించిన ట్రావెన్‌కోర్ బోర్డ్ ఇప్పుడు తన వైఖరి మార్చుకుంది. మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని ట్రావెన్‌కోర్ బోర్డ్ న్యాయస్థానంలో అంగీకరించింది. గతంతో 10 నుంచి 50 ఏళ్ళ మహిళల ప్రవేశాన్నివ్యతిరేకించిన ట్రావెన్‌కోర్ బోర్డ్ ఇప్పుడు వైఖరి మార్చుకోవడం విశేషం. అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్‌ బోర్డు తాజాగా యూటర్న్‌ తీసుకుంది.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాలలోపు మహిళల ప్రవేశంపై దశాబ్దాల నుంచి అమలౌతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు వెలువరించింది. దీన్ని పలు హిందూ సంఘాలతో పాటు ట్రావెన్‌ కోర్‌ బోర్డు కూడా వ్యతిరేకించింది. తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. తీర్పుపై ఎలాంటి పనఃసమీక్ష అవసరం లేదని కేరళ ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. అనంతరం ట్రావెన్‌ కోర్‌ బోర్డు కూడా తన వైఖరి మార్చుకుంది. ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును పాటిస్తామని న్యాయస్థానానికి వెల్లడించింది. శబరిమల వివాదం రెండు వర్గాల మధ్య సమస్య కాదని ఒక మతానికి సంబంధించిన అంశమని బోర్డు ఈ సందర్భంగా తెలిపింది.

లైవ్ టీవి

Share it
Top