Top
logo

అందుకే బీజేపీలో చేరా: డీకే అరుణ

అందుకే బీజేపీలో చేరా: డీకే అరుణ
Highlights

గద్వాల జేజమ్మ మాజీ మంత్రి డీకే అరుణ కాషాయం కండువా కప్పుకుంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ...

గద్వాల జేజమ్మ మాజీ మంత్రి డీకే అరుణ కాషాయం కండువా కప్పుకుంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంది. బీజేపీ చేరిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు చాలా నష్టం జరిగిందని, పార్టీ నేతలపై అధిష్టానానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీ మారినట్లు డీకే అరుణ తెలిపారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్లే పార్టీ పరాజయాల పాలవుతుందని వ్యాఖ్యానించారు.

Next Story